నా సాయం తీసుకోండి: క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆవేదనతో షేన్ వార్న్

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు మళ్లీ గాడిలో పడేందుకు అవసరమైతే తాను సాయం చేస్తానని మాజీ ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ చెప్పాడు. క్రికెట్ ఆస్ట్రేలియా దుస్థితిపై షేన్ వార్న్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజాలైన
మెక్‌గ్రాత్, క్లార్క్ సేవలను వాడుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు సూచించాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ పరిస్థితి చూసి తనకు విసుగొస్తున్నదని అన్నాడు. అధికారిక హోదాలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఎలాంటి సేవ కావాలన్నా చేయడానికి తాను సిద్ధమేనని వార్న్ చెప్పుకొచ్చాడు. తాజాగా హెరాల్డ్ సన్ పత్రికకు రాసిన కాలమ్‌లో "డొనాల్డ్ ట్రంప్ మాటల్లో చెప్పాలంటే, మనం క్రికెట్‌ను మళ్లీ గొప్పగా చేద్దాం" అని అన్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా లక్ష్యం నీరుగారి పోయింది
"ఆస్ట్రేలియా ఫేవరెట్ స్పోర్ట్‌గా క్రికెట్‌ను చేయాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా లక్ష్యం నీరుగారి పోయింది. బోర్డులో ఇప్పుడు పూర్తి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్‌ను మళ్లీ గాడిన పడేసేందుకు తన మాజీ సహచరులు సాయం చేయాలి" అని షేన్ వార్న్ కోరాడు.

బ్యాటింగ్, బౌలింగ్ సలహాదారులుగా
"బ్యాటింగ్, బౌలింగ్ సలహాదారులుగా క్లార్క్, మెక్‌గ్రాత్‌లాంటి వాళ్లను ఎందుకు నియమించడం లేదు. ఎంతో మంది యువ స్పిన్నర్లకు అనధికారికంగా నేను సాయం చేశా. ఇప్పుడదే అధికారికంగా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను" అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు.

సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో నియమిస్తేనే
సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో నియమిస్తేనే ఆస్ట్రేలియా క్రికెట్ మళ్లీ గాడిన పడుతుందని తాను భావిస్తున్నట్లు షేన్ వార్న్ తెలిపాడు. త్వరలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 21న ఇరు జట్ల మధ్య జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications