ఒకప్పుడు టీంలో తోపు ప్లేయర్..ఇప్పుడు గతిలేక బ్యాంకులో ఉద్యోగం
ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్‌లో స్టార్ బౌలర్‌గా వెలుగొందిన నాథన్ బ్రాకెన్ గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. తన ఎడమ చేతి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించిన బ్రాకెన్, 2008లో ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. 2003, 2007 ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా తరఫున ఆడి, 2006 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తన సత్తా చాటాడు.
తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన బ్రాకెన్‌కు, 2001లో 'యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్', 2009లో 'ఆస్ట్రేలియా వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. అయితే, దురదృష్టవశాత్తు, 2012 తర్వాత మోకాలి గాయం కారణంగా అతని కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ గాయం వల్ల అతను క్రికెట్‌కు తొందరగానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.

రిటైర్మెంట్ తర్వాత బ్రాకెన్ జీవితం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడింది. కానీ అతను ధైర్యం కోల్పోలేదు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో, బ్రాకెన్ ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ బ్యాంకులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్ మైదానంలో తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ మాజీ ఆటగాడు, ఇప్పుడు ఒక సాధారణ ఉద్యోగిగా స్థిరపడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని పట్టుదల, జీవితం పట్ల అతని దృక్పథం ఎందరికో స్ఫూర్తినిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications