Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియన్ ఆర్మీకి ప్రేమతో వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో పోస్టు

హైదరాబాద్: ఇండియన్ ఆర్మీకి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దుతుగా నిలిచాడు. కుటుంబ సభ్యులను వదిలి రాత్రింబవళ్లు పహరా కాస్తున్న వారందరిపై ప్రేమను కురిపించాడు. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో గాయపడిన మేజర్‌ అమర్‌దీప్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పోస్టు పెట్టాడు.

'మేజర్‌ అమర్‌దీప్‌ ఒక సైనికుడు. అతని తలలో బుల్లెట్‌ దిగింది. ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. దేశమంతా నీ కోసం ప్రార్థనలు చేస్తున్నది సోదరా..' అని మాజీ సైన్యాధికారి మేజర్‌ గౌరవ్‌ ఆర్య చేసిన ట్వీట్‌కు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఈ సందర్భంగా అమర్‌దీప్‌కు చికిత్స చేస్తున్న ఫొటోను కూడా మాజీ అధికారి పోస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే ఫిబ్రవరి 23న శ్రీనగర్‌కు దాదాపు 60 కిలోమీటర్లు దూరంలో కుంగ్ను ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించిన అనంతరం తిరిగి వస్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేయడంతో ముగ్గురు సైనికులు, ఒక మహిళ మృతిచెందారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+