ఐరన్ లేడీ: జయలలిత మృతిపై ట్విట్టర్‌లో ఎవరేమన్నారు
హైదరాబాద్: 75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) డిసెంబర్ 5 (సోమవారం) రాత్రి కన్నుమూశారు. సోమవారం రాత్రి 11.30కు జయలలిత మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆసుపత్రి నుంచి పార్థివదేహాన్ని అర్ధరాత్రి పోయెస్ గార్డెన్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడినుంచి మంగళవారం ఉదయం మౌంట్‌రోడ్‌లోని రాజాజీ హాల్‌కు తరలించారు. జయ మృతి అనంతరం అన్నాడీఎంకే శాసనసభాపక్షం తదుపరి సీఎంగా పన్నీర్‌సెల్వంను ఎన్నుకుంది.
ఇక, జయలలిత మృతితో తమిళనాడు రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఆమె మృతి పట్ల దేశ వ్యాప్తంగా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. జయ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. జయ మృతితో చెన్నై జనసంద్రమైంది. ఆమె పార్ధీవ దేహాన్ని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జయ అభిమానులు చెన్నైకి చేరుకున్నారు. జయ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
వీరేంద్ర సెహ్వాగ్
తమిళనాడులో శాంతి నెలకొనాలి. అమ్మ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
మహ్మాద్ కైప్
ఒక శకం ముగిసింది. జయలలిత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కైప్ ట్వీట్ చేశాడు.
దినేశ్ కార్తీక్
అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు.
ఉమేశ్ యాదవ్
మేమంతా మిమ్మల్ని మిస్ అవుతున్నాం. జయలలిత జీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉమేశ్ యాదవ్ ట్వీట్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్
ఆమె సూపర్ క్వీన్. గ్రేట్ ఫైటర్, రియల్ ఛాంపియన్ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీ ట్వీట్ చేసింది.
క్రిస్ శ్రీకాంత్
మీ పోరాటం మా అందరికి స్పూర్తి. నాకు తెలిసి అత్యంత ప్రజాకర్షణ కలిగిన మహిళా నేత మీరు. మీ అత్మకు శాంతి కలగాలి.
అజీద్ మీమన్
భారతీయ రాజకీయాలతో పాటు తమిళనాడులో జయలలిత గేమ్ ఛేంజర్
రవీంద్ర జడేజా
అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications