Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్ రియాక్షన్స్: క్రిస్ గేల్‌కు ప్రశంసలు, క్రికెట్‌కు కొత్త 'వరల్డ్ బాస్'

బెంగుళూరు: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌‌లో 8వ ఎడిషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని సీజన్లలో తన ఆటతీరుతో భారత్‌లో అభిమానులను సంపాదించుకున్న ఏకైక ఆటగాడు క్రిస్ గేల్ మాత్రమే.

ఐపీఎల్‌లో క్రిస్ గేల్ ఓ ప్రభంజనం. అతడు క్రీజులోకి అడుగుపెడుతున్నాడంటే, స్టేడియం మొత్తం అరుపులు, ఆ తర్వాత క్రిస్ గేల్ మెరుపులు. ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో భాగంగా బుధవారం రాత్రి బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ అద్భుత సెంచరీని చూసిన మాజీలు, క్రికెటర్లు అతడిని క్రికెట్‌కు 'వరల్డ్ బాస్' అంటూ ప్రశంసించారు.

From Twitter: Cricketers hail 'World Boss' Chris Gayle

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ తన ట్విట్టర్‌లో ఈ జమైకన్‌ని క్రికెట్‌కు 'వరల్డ్ బాస్' అంటూ ట్వీట్ చేశాడు. 46 బంతుల్లో (11 సిక్సులు, 14 డాట్ బాల్స్) 100 పరుగులు సాధించి క్రిస్ గేల్ బెంగుళూరు స్డేడియంలో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.

100 పరుగులు సాధించడానికి క్రిస్ గేల్ అచ్చం ఫోర్స్, సిక్సులే కొట్టాడు. బెంగుళూరులోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 57 బంతులాడిన క్రిస్ గేల్ 117 పరుగులు చేశాడు. అందులో 12 సిక్సులు, 7 ఫోర్లు ఉండటం విశేషం.

పుట్ బాల్ ఆటగాడు క్రిస్టినో రోనాల్డో మాదిరిగా తన సెంచరీని క్రిస్ గేల్ సంబురం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్‌ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్స్ మీకోసం.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+