కోహ్లీ మయమైన ట్విట్టర్: సెహ్వాగ్ సరదా ట్వీట్ ఇదే
న్యూఢిల్లీ: భారత టెస్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శనివారం (నవంబర్ 5)న 28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఎప్పటిలాగే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దైన శైలిలో కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు స్ఫిన్నర్ హార్భజన్ సింగ్, మాజీ బ్యాట్స్‌మెన్ ఆకాష్ చోప్రా, కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
బీసీసీఐ
28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వీడియో రూపంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అనిల్ కుంబ్లే
28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఉండాలంటూ టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పేర్కొన్నారు.
హార్ధిక్ పాండ్యా
టీమిండియా ఆల్ రౌండర్, ఇంగ్లాండ్‌తో నవంబర్ 9 నుంచి జరగనున్న టెస్టు సిరిస్‌లో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా టెస్టు కెప్టెన్ కోహ్లీకి ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
వీరేంద్ర సెహ్వాగ్
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పటిలాగే తన సహచర ఆటగాడు తన దైన శైలిలో కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఆకాష్ చోప్రా
28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా 'మోడ్రన్ గ్రేట్' అంటూ ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
సురేశ్ రైనా
28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్ స్టార్ బ్యాట్స్ మెన్లలో ఒకడైన సురేశ్ రైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
శిఖర్ ధావన్
28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
స్ఫిన్నర్ హార్భజన్ సింగ్
28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా వెటరన్ స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ 'గాడ్ బ్లెస్' కోహ్లీ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
మూడేళ్ల వయసులో విరాట్ కోహ్లీ
28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బుక్ మై షో వెబ్ సైట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కోహ్లీ చిన్నతనంలో తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
యువ ఆటగాళ్లకు స్పూర్తి
టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రాణిస్తున్న తీరు అద్భుతం. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు కోహ్లీ ఎంతో విలువైన సూచనలను ఇస్తుంటాడు. ఇదే క్రమంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్ ఇది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications