ఢిల్లీ: అజిత్ అగార్కర్ పైన భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ధోనీ పైన చేసిన వ్యాఖ్యలకు ఆయన పైన సామాజిక అనుసంధాన వేదికలు ట్విట్టర్ తదితరాల్లో ఆగ్రహోద్రులవుతున్నారు.

అయితే, కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికే వారు కూడా లేకపోలేదు. అయితే, ఎక్కువమంది అజిత్ అగార్కర్‌కు వ్యతిరేకంగా ట్వీట్ల్ చేస్తున్నారు. దక్షిణాఫ్రితో జరిగిన ట్వంటీ 20 సిరీస్ భారత్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ధోనీ కెప్టెన్‌గానే కాకుండా ఇంకా ఆటగాడిగా కూడా అవసరమా అనే విషయం ఆలోచించాలని అగార్కర్ పేర్కొన్నాడు. దీనిపై ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. అగార్కర్ వరుసగా ఏడుసార్లు డకౌట్ అయ్యాడని, నీ తప్పు తెలుసుకొని క్షమాపణ చెబుతావుకుంటున్నానని ట్వీట్లు చేస్తున్నారు.