Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ నుంచి రైనా వరకు: భువీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

From Sachin to Suresh Raina: Cricket fraternity wishes 'swing king' Bhuvneshwar Kumar on birthday

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌కు జన‍్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం (ఫిబ్రవరి 5)న 29వ పుట్టినరోజుని జరుపుకుంటున్న భువనేశ్వర్ కుమార్‌కు పలువురు క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

భువీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో పాటు టీమిండియా ఆటగాళ్లు సురేష్ రైనా, మురళీ విజయ్‌... దేశవాళీ టోర్నీలతో బిజీగా ఉన్న కరుణ్‌ నాయర్‌లు ఉన్నారు. 'భారత జట్టులో బంతి ఇస్తే వికెట్లు, బ్యాట్‌తో పరుగులు చేసే మిస్టర్‌ 'డిపెండ్‌బుల్‌' భువీ... వెరీ హ్యాపీ బర్త్‌ డే' అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక, వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్‌లో 'ఫీల్డ్‌లో ప్రతీసారి సత్తాచాటుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న భువీకి హ్యాపీ బర్త్‌ డే. ఇలాగే మరింతగా మెరవాలని ఆశిస్తున్నా' అని ట్వీట్ చేశాడు.

'హ్యాపీ బర్త్‌ డే బ్రదర్‌.. ఈ ఏడాది కూడా స్వింగ్‌తో మరిన్ని ఎక్కువ వికెట్లను సాధించు' అని మురళీ విజయ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

'భువీకి వెరీ హ్యాపీ బర్త్‌ డే. నీకు ఇదొక అద్భుతమైన రోజు.. రాబోవు కాలంలో మరిన్ని వికెట్లతో సత్తాచాటుతావని ఆశిస్తున్నా' అని కరుణ్‌ నాయర్‌ అభినందించాడు.

'మా స్వింగ్‌ కింగ్‌కు ఇవే మా పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భువనేశ్వర్‌ కుమార్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2018 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ భువీని వేలానికి ముందే అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 17:21 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+