ఎంత ఎదిగినా ఒదిగుండాలంటున్న భారత క్రికెటర్, లోకల్ ట్రైనులో ప్రయాణం

హైదరాబాద్: భారత జట్టు ఫేసర్ శార్దూల్ ఠాకూర్ అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణం పట్టిన భారత జట్టు ఆటగాళ్లలో శార్ధూల్ ఠాకూర్ ఒకడు. ఈ ప్రయాణంలో భాగంగా జెట్ విమానం దిగి నేరుగా ముంబై లోకల్ ట్రైన్ ఎక్కాడు.
ఇలా చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని అతనినే అడిగితే.. 'నేను విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి నేరుగా లోకల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. ఇంటికి త్వరగా వెళ్లే ఆలోచనలోనే ఉన్నాను. కానీ, కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులను చూసేసరికి తెలిసింది. వాళ్లంతే నన్నే చూస్తున్నారని. నేనా.. కాదా.. అని నిర్ధరించుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతకడం మొదలుపెట్టారు' అంటూ నవ్వుతూ బదులిచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ.. ' కొంత మంది కాలేజి కుర్రాళ్లకి నేనెవరో తెలుసుకునేందుకు గూగుల్‌ని వాడారు. నేను వాళ్లతో పల్గార్ వెళ్లేందుకు రైలు ఎక్కానని చెప్పాను. వాళ్లంతా ఒకింత ఆశ్చర్యానికి గురైయ్యారు. అంతకుముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలానే ఉన్నా. నేను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు' అని పేర్కొన్నాడు.
మొన్నామధ్య మ్యాచ్‌లో ఉపయోగించే టీ షర్ట్ శార్దూల్ ఠాకూర్ వాడడంతో నెటిజన్లు అతనిపై చురకలు మొదలుపెట్టారు. నంబర్ 10 గల సచిన్ టెండూల్కర్ టీ షర్ట్ నువ్వెందుకు వేసుకున్నావంటూ ప్రశ్నలు సంధించారు. ఇండియన్ టీమ్ తరఫున శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్‌ను ట్విట్టర్‌లో నెటిజన్లు బాగానే తికమకపెట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications