మొన్న 400... నేడు ఛాంపియన్: ప్రత్యేకమైన జెర్సీలో బ్రావో

హైదరాబాద్: డ్వేన్ బ్రావో... ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 11వ సీజన్‌లో అభిమానులను తన డ్యాన్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. వెస్టిండిస్‌కు చెందిన బ్రావో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. చెన్నై మ్యాచ్ గెలిచిన తర్వాత 'ఛాంపియన్' పాట ఆలపిస్తూ, డ్యాన్స్ చేస్తూ సహచర ఆటగాళ్లతో సరదాగా గడిపేవాడు.

400వ నంబర్ జెర్సీ ధరించిన బ్రావో
ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బ్రావో 400వ నంబర్ జెర్సీ ధరించి అభిమానులను ఆశ్యర్యానికి గురి చేశాడు. ఇదే మ్యాచ్‌లోనే వెస్టిండిస్‌కు చెందిన మరో ఆటగాడు పొలార్డ్ కూడా 400వ నంబర్ కలిగిన జెర్సీని ధరించాడు. ఈ ఇద్దరూ ఇలా ప్రత్యేకంగా జెర్సీలను ధరించడం వెనుక కారణం ఉంది.

ప్రత్యేక జెర్సీలు ధరించి మ్యాచ్
నాలుగు వందల టీ20 మ్యాచ్‌లు ఆడినందుకు పొలార్డ్ , టీ20ల్లో 400 వికెట్లు తీసినందుకు బ్రావో ఈ ప్రత్యేక జెర్సీలు ధరించినట్లు మ్యాచ్ అనంతరం తెలిసింది. కాగా, ప్రస్తుతం కెనడా వేదికగా జరుగుతన్న గ్లోబల్ టీ20లో డ్వేన్ బ్రావో ఆడుతున్నాడు. ఐపీఎల్ తరహాలో ఇటీవలే కెనడాలో ఈ లీగ్‌ను ఆరంభించారు.

‘ఛాంపియన్' అన్న పేరుతో ఉన్న జెర్సీని ధరించిన బ్రావో
ఈ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో బ్రావో మరోసారి ప్రత్యేకమైన జెర్సీలో కనిపించాడు. డి.జె. బ్రావో అని 47వ నంబర్ జెర్సీ ధరించే బ్రావో ఈ సారి ‘ఛాంపియన్' అన్న పేరుతో ఉన్న జెర్సీ ధరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మొన్న 400... నేడు ఛాంపియన్
దీంతో "బ్రావో మరోసారి తన జెర్సీని మార్చాడు. మొన్న 400... నేడు ఛాంపియన్" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందుకు ఓ ప్రత్యేకత ఉంది. 2016లో బ్రావో ‘ఛాంపియన్' పేరిట రూపొందించిన పాటకు గుర్తుగా ఈ జెర్సీని ధరించాడని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications