రోహిత్.. ధావన్‌లు ఇద్దరికీ మతిమరుపే..!!


హైదరాబాద్: కోహ్లీసేన మైదానంలో ఉంటే మాత్రమే సీరియస్‌గా కనిపిస్తారని డ్రెస్సింగ్ రూంలో ఉన్నంత సమయం ఒకరిమీ ఒకరు కామెంట్లు చేసుకుంటూ సరదాగా గడిపేస్తారని వింటూనే ఉన్నాం. తాజాగా ఇటువంటి ఘటనను అభిమానులు ముందుకు తీసుకొచ్చి మరోసారి నిరూపించింది బీసీసీఐ. ఈ క్రమంలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ ర్యాపిడ్ ఫైర్‌లో పాల్గొని, తమ సహచరుల గురించి ఎవరికి తెలియని నిజాలు వెల్లడించారు.
టీమిండియాతో ఒక్క నిమిషం
ట్విటర్‌లో పెట్టిన బీసీసీఐ వీడియోకు..‘టీమిండియాతో ఒక్క నిమిషం' అని పేరు పెట్టారు. అలాగే ఆ ఐదుగురు క్రికెటర్లను తమ జట్టు సభ్యుల గురించి కొన్ని సరదా ప్రశ్నలు వేశారు. ఎక్కువగా నిద్రపోయేది ఎవరు? భోజన ప్రియులు ఎవరు? వంటి తదితర ప్రశ్నలకు వారి నుంచి చాలా కామెడీగా సమాధానాలు వచ్చాయి. నిర్మొహమాటంగా ఆటగాళ్ల పేర్లు చెప్పడం నవ్వు తెప్పించింది.

ఎక్కడపడితే అక్కడ నిద్రపోయేవారెవరు?
బుమ్రా
రోహిత్
శిఖర్ ధావన్
హార్దిక్ పాండ్యా
షమీ

ఆఖరి నిమిషంలో ప్లాన్ కాన్సిల్ చేసేదెవరు?
షమీ
ధావన్
రైనా
రోహిత్
బుమ్రా & షమీ

ఎప్పుడూ ఆకలితో ఉండేదెవరు?
ఇషాంత్ శర్మ
రిషబ్ పంత్
యుజ్వేంద్ర చాహల్
దినేశ్ కార్తీక్

ఎక్కువ మతిమరుపు ఉండెదేవరికి?
రోహిత్ శర్మ
శిఖర్ ధావన్

ఫోన్‌తోనే ఎక్కువ కాలక్షేపం చేసెదవరు?
హార్దిక్ పాండ్యా
కుల్దీప్ యాదవ్
చాహల్

షాపింగ్ అంటే ఎక్కువ ఎవరికి ఇష్టం?
కేఎల్ రాహుల్
దినేశ్ కార్తీక్
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే జరిగిన టీ20 సిరీస్‌ను సమం చేసింది. డిసెంబరు ఆరో తేదీ నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం విరాట్ బృందం సమయాత్తమవుతోంది. అడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా వార్మప్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ఆడుతోన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications