1992 నుంచి 2019 వరకు: వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీలివే!

హైదరాబాద్: వరల్డ్‌కప్ జెర్సీ అంటేనే ఎంతో ప్రత్యేకం. 1992 వరల్డ్‌కప్ ముందు వరకు జరిగిన క్రికెటర్లు తెల్లటి జెర్సీలనే ధరించారు. అయితే, మొట్టమొదటి సారి 1992లో కలర్ జెర్సీలను క్రికెటర్లు ధరించారు. ఆ తర్వాత జరిగిన వరల్డ్‌కప్‌లో కూడా మొదట ధరించిన జెర్సీలనే ధరించారు. అయితే, 1999 నుంచి వరల్డ్‌కప్‌లో పాల్గొనే జట్లు వారి సొంత వర్షన్లతో కూడిన జెర్సీలను ధరించడం ప్రారంభించారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లీ సేన సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో నైకీ రూపొందించిన సరికొత్త జెర్సీలను టీమిండియా ధోని, విరాట్ కోహ్లీ, హర్మన్ ప్రీత్ కౌర్, అజ్యింకె రహానే, పృథ్వీషా, రోడ్రిగస్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 1999 నుంచి 2019 వరకు వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో టీమిండియా ధరించిన జెర్సీలను ఒక్కసారి చూద్దామా!
1992 వరల్డ్ కప్
1992 వరల్డ్ కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీ ఇదే.
1996 వరల్డ్‌కప్
1996 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీ ఇది. 1996 వన్డే వరల్డ్ కప్‌లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఇన్నింగ్స్.

1999 వరల్డ్ కప్
1999 వరల్డ్ కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీ ఇది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు.

2003 వరల్డ్‌కప్
2003 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీ ఇది. వికెట్ ఆనందంలో సంబరాలు చేసుకుంటున్న క్రికెటర్లు.

2007 వరల్డ్‌కప్
2007 వరల్డ్‌కప్ మాత్రం టీమిండియా ఓ పీడకలే. ఈ మెగా టోర్నీలో టీమిండియా లీగ్ స్టేజిలోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2011 వరల్డ్‌కప్
2011 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీ ఇది. ముంబైలోని వాంఖడె వేదికగా జరిగిన పైనల్లో శ్రీలంకపై విజయం సాధించి రెండోసారి వరల్డ్‌కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో కెప్టెన్ ధోని తనదైన శైలిలో సిక్స్ బాది భారత్‌కు వరల్డ్‌కప్ అందించాడు.

2015 వరల్డ్ కప్
2015 వరల్డ్‌కప్‌లో టీమిండియా ధరించిన జెర్సీ ఇది. స్పాన్సర్ పేరు లేకుండా టీమిండియా జెర్సీ ధరించడం ఇదే మొదటిసారి. ఈ మెగా టోర్నీలో టీమిండియా సెమీపైనల్ స్టేజి వరకు వెళ్లింది.

2019 వరల్డ్‌కప్
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా మరో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. గతంలోలాగే రీసైకిల్డ్ మెటీరియల్‌తో 'నైకీ' దీనిని తయారు చేసింది. కొత్త జెర్సీలో రెండు రకాల బ్లూ షేడ్స్ ఉన్నాయి. గత జెర్సీతో పోలిస్తే ఒక ప్రధానమైన మార్పు కొత్తదాంట్లో కనిపించింది. కాలర్ వెనుక నారింజ రంగు షేడ్ ఇచ్చారు. చాతి పైన కుడివైపు నైకీ సింబల్, ఎడమవైపు బీసీసీఐ లోగో ఉంది. ప్రధాన స్పాన్సర్ ఒప్పో ఇండియా అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తోంది. మూడు ప్రపంచకప్‌ల గెలుపునకు సంకేతంగా ఇప్పటి వరకు ఎదపై కనిపించిన మూడు ‘స్టార్లు' ఇకపై కాలర్ లోపలి వైపు కనిపించేలా ముద్రించారు. పైగా తొలిసారి ఆ మూడు వరల్డ్ కప్ విజయాల (1983, 2007, 2011) తేదీలు, ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ చేసిన స్కోర్లను కూడా దానిపై ముద్రించారు. దీంతో పాటు ఆ మూడు ఫైనల్స్ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల భౌగోళిక స్థితి (అక్షాంశాలు-రేఖాంశాలు) కూడా దీనిపై ముద్రించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications