తెల్లగడ్డం తీసేశాడు: క్లీన్ షేవ్‌తో ధోని, సోషల్ మీడియాలో ఫోటో వైరల్


హైదరాబాద్: ధోని అభిమానులకు శుభవార్త. ఎట్టకేలకు ఇంగ్లాండ్ పర్యటనలో ధోని తెల్లగడ్డం తీసేసి కనిపించాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో ధోనీ తెల్ల గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. ధోని కొత్త లుక్ అభిమానులకు నచ్చలేదు.

తెల్ల గడ్డంతో ఉన్న ధోనికి గంభీర్ సలహా
అంతేకాదు టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం తెల్ల గడ్డంలో ఉన్న ధోనిని చూసి ఐదు నుంచి పదేళ్ల పెద్దగా కనిపిస్తున్నాడంటూ ఓ టీవీ షోలో వ్యాఖ్యానించాడు. దీంతో పాటు ధోని తన గడ్డం రంగు మార్చుకోవాలని లేదా తన గడ్డానికి రంగు వేసుకోవాలని సలహా కూడా ఇచ్చాడు.

గంభీర సలహా పాటించిన ధోని
గంభీర సలహా పాటించాడో లేదో తెలియదు గానీ... ధోని ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడే తన తెల్లగడ్డాన్ని తీసేశాడు. తాజాగా ధోని క్లీన్ షేవ్‌లో ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడంతో ధోని భారత్‌కు తిరుగు పయనమయ్యాడు.
యువ క్రికెటర్లతో కలిసి ధోని ఫోటో
బీసీసీఐ సెలక్టర్లు ఇటీవల ప్రకటించిన టెస్టు జట్టులో చోటు దక్కంచుకోని అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ కూడా భారత్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ యువ క్రికెటర్లు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోని అక్షర్ పటేల్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

క్లీన్ షేవ్‌తో కనిపించిన ధోని
ఈ ఫోటోలో ధోని క్లీన్ షేవ్‌తో కనిపించాడు. చాలా రోజుల తర్వాత ధోని క్లీన్ షేవ్‌తో కనిపించడంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోని చూసిన అభిమానులు ధోని తెల్లగడ్డం తీసేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications