Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేమైంది?: గాయాల బారిన సఫారీలు, ఒత్తిడిలో దక్షిణాఫ్రికా

హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టుని గాయాలు వేధిస్తున్నాయి. ఆ జట్టుకు చెందిన ముగ్గురు స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా ప్రస్తుతం భారత్‌తో జరుగుతోన్న ఆరు వన్డేల సిరిస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా జట్టుకు అద్భుత విజయాలు అందించడంలో ఏబీ డివిలియర్స్, కెప్టెన్ డుప్లెసిస్, క్వింటన్ డీకాక్‌లు కీలకపాత్ర పోషిస్తారు.

తీవ్ర ఒత్తిడిలో దక్షిణాఫ్రికా

తీవ్ర ఒత్తిడిలో దక్షిణాఫ్రికా

ఈ ముగ్గురూ ఇప్పుడు గాయల బారిన పడటం జట్టుని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. జోహెన్స్ బర్గ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి టెస్టులో గాయపడటంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్‌తో ఆరు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ డుప్లెసిస్ చేతివేలుకు గాయం కావడంతో వన్డే సిరిస్‌తో పాటు మూడు టీ20ల సిరిస్‌కు దూరమయ్యాడు.

 రెండో వన్డేలో డికాక్ మణికట్టుకు గాయం

రెండో వన్డేలో డికాక్ మణికట్టుకు గాయం

ఇప్పుడు వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ ఆదివారం జరిగిన రెండో వన్డేలో డికాక్ మణికట్టుకు గాయమైంది. దీంతో అతడు కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో మిగిలిన వన్డేలతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇలా స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా తప్పుకోవడంతో జట్టుని తీవ్ర ఒత్తిడిలో నెట్టింది.

సఫారీ పర్యటనకు ఆస్ట్రేలియా

సఫారీ పర్యటనకు ఆస్ట్రేలియా

అంతేకాదు భారత్‌తో సిరిస్ ముగిసిన అనంతరం సఫారీ పర్యటనకు ఆస్ట్రేలియా రానుంది. మార్చి 1న ఆస్ట్రేలియాతో మొదలయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌కైనా డీకాక్ అందుబాటులోకి వస్తాడా? లేదా అన్నది అనుమానంగా మారింది. మరోవైపు భారత్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌పై డికాక్‌కు బదులుగా వికెట్‌కీపర్‌గా జట్టుకు ఎంపికైన హెన్రిచ్ క్లాసెన్ మూడో వన్డేలో అరంగేట్రం చేసే అవకాశముంది.

 ఆమ్లాతో కలిసి ఓపెనింగ్‌కు ఎవరు?

ఆమ్లాతో కలిసి ఓపెనింగ్‌కు ఎవరు?

వన్డేల్లో ఓపెనర్‌గా రాణిస్తున్న డీకాక్ ఈ సిరిస్‌కి దూరం కావడంతో ఆమ్లాతో కలిసి ఓపెనింగ్‌కు ఎవరు దిగుతారనే దానిపై కూడా సందిగ్ధత ఏర్పడింది. 2009 తర్వాత డివిలియర్స్, డుప్లెసిస్ లేకుండా దక్షిణాఫ్రికా బరిలోకి దిగడం ఇదే తొలిసారి. ఆరు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది.

సఫారీ వరుస విజయాలకు కోహ్లీసేన బ్రేక్

సఫారీ వరుస విజయాలకు కోహ్లీసేన బ్రేక్

ఈ సిరిస్‌కు వరుసగా 17 విజయాలతో జోరు మీద కనిపించిన దక్షిణాఫ్రికాకు కోహ్లీసేన డర్బన్‌లో బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా బుధవారం మూడు వన్డే జరగనుంది. ఇక, చేతి వేలు గాయానికి గురైన డివిలియర్స్ శనివారం జరిగే నాలుగో వన్డేలో ఆడే అవకాశం కనిపిస్తోంది.

Story first published: Tuesday, February 6, 2018, 11:42 [IST]
Other articles published on Feb 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+