Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

French Open: షరపోవా తర్వాత అతి చిన్న వయసులో గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా కోకో గౌఫ్

 Coco Gauff

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ కోకో గౌఫ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరుకుంది. ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్‌తో ఫైనల్లో తలపడనుంది. గురువారం మార్టినా ట్రెవిసన్‌పై సెమీస్లో వరుస సెట్‌లలో విజయం సాధించిన కోకో తన తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 18ఏళ్ల కోకో గౌఫ్ సెమీస్లో ట్రెవిసన్‌పై 6-3, 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోకో గౌఫ్, ట్రెవిసన్ తొలిసారిగా గ్రాండ్ స్లామ్ పోటీల్లో తమ తొలి సెమీఫైనల్ ఆడారు.

ఇకపోతే 2004లో వింబుల్డన్ గెలిచిన మరియా షరపోవా తర్వాత గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన అత్యంత పిన్న వయస్కురాలుగా గౌఫ్ రికార్డులకెక్కింది. ఇక మ్యాచ్ అనంతరం కోకో గౌఫ్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నేను కొంచెం షాక్‌లో ఉన్నాను. అసలు ఏం మాట్లాడలో కూడా అర్థం కావడం లేదు' అని గౌఫ్ అంది.

శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా 34మ్యాచ్‌లు గెలిచిన స్విటెక్‌తో 18వ సీడేడ్ ప్లేయర్ అయిన కోకో గౌఫ్ తలపడనుంది. ఇక స్విటెక్‌తో కోకో గౌఫ్ గెలవడం చాలా కష్టమే అయినా ఇప్పటివరకు బాగా రాణిస్తున్న గౌఫ్ సంచలనాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే 18ఏళ్ల క్రితం లండన్‌లో సెరెనా విలియమ్స్‌ను షరపోవా మట్టికరిపించి అత్యంత పిన్న వయస్సులో గ్రాండ్ స్లామ్ విజేతగా అవతరించింది.

ఇక ఆమె తర్వాత కోకో గౌఫ్ కూడా ఇలాంటి సంచలనం నమోదు చేయాలని అమెరికన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే కోకో గౌఫ్ ఫైనల్ పోరు గురించి మాట్లాడుతూ.. ' నేను మరో మ్యాచ్‌లాగే ఫైనల్ మ్యాచ్‌ను కూడా భావించి నా సత్తా మేరకు ఆడతా, ఫైనల్ పోరును ఎంతో ప్రత్యేకంగా తీసుకుని ఒత్తిడి పెంచుకోను' అని పేర్కొంది.

Story first published: Friday, June 3, 2022, 16:22 [IST]
Other articles published on Jun 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+