Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DLS రూపకర్త డక్‌వర్త్ కన్నుమూత

మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించిన సందర్భాల్లో క్రికెట్ అభిమానులు తరుచూ వినే మాట 'డక్‌వర్త్ లూయిస్ పద్ధతి'. దీని ప్రకారం లక్ష్యాన్ని కుదించారని, ఓవర్లు తగ్గించారని తరుచూ వింటుంటాం. అయితే ఈ డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూశారు. ఈ నెల 21న డక్‌వర్త్ మరణించారు. వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.

కాగా, 84 ఏళ్ల డక్‌‌వర్త్ మరణవార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఓ ప్రముఖ వెబ్‌సైట్ మంగళవారం ఆయన మరణవార్తను తెలిపింది. ఇంగ్లండ్‌కు చెందిన డక్‌వర్త్ గణాంక నిపుణుడు.ఆయన టోనీ లూయిస్‌తో కలిసి డీఎల్‌ఎస్ పద్ధతిని ఆయన రూపొందించారు. వరుణుడు ఆటంకం కలిగించే మ్యాచ్‌ల్లో ఫలితం తేలడానికి కొత్త సమీకరణం తీసుకువచ్చారు.

Frank Duckworth co-inventor of DLS method dies at the age of 84

అంతకుముందు వర్షం కారణంగా ఆటంకం కలిగితే మ్యాచ్‌ను రద్దు చేసేవారు. కానీ డక్‌వర్త్-‌లూయిస్ తీసుకువచ్చిన పద్ధతితో విజేతను నిర్ణయించడానికి అవకాశం లభించింది. డీఎల్‌ఎస్ పద్ధతిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1997లో తొలిసారి‌గా అమలు చేసింది. అనంతరం వర్షప్రభావిత మ్యాచ్‌ల్లో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001‌లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది.

అయితే ఈ డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి తదనంతరం ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్‌ స్టెర్న్ కొన్ని మార్పుచేర్పులు చేశారు. ఆ తర్వాత ఈ పద్ధతికి డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్)గా నామకరణం చేశారు. కాగా, లూయిస్ 2020లో కన్నుమూశారు. అయితే ఈ డీఎల్‌ఎస్ పద్ధతి కొన్ని జట్లకు వరంగా, కొన్ని జట్లకు శాపంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించలేని సందర్భాల్లో అప్పటివరకు విజయం దిశగా దూసుకెళ్తున్న జట్లు ఎన్నోసార్లు ఓటమి చవిచూశాయి. ఈ సందర్భాలు చాలా తక్కువ.

Story first published: Wednesday, June 26, 2024, 8:18 [IST]
Other articles published on Jun 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+