For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : మినీ వేలంలో బెస్ట్ ఫినిషర్లు.. ఫ్రాంచైజీలు ఊరికినే కూర్చుంటాయా?

Franchises are eyeing these finishers in IPL Mini Auction

పొట్టి ఫార్మాట్‌లో ఫినిషర్ల పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లీర్స్, కీరన్ పొలార్డ్.. ఆయా జట్లకు ఫినిషర్లుగా అద్భుతంగా రాణించారు. అయితే వీళ్లంతా సీనియర్లు. డివిల్లీర్స్, పొలార్డ్ ఇప్పటికే ఆటకు వీడ్కోలు చెప్పేయగా.. ధోనీకి కూడా ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నయా ఫినిషర్ల కోసం ఫ్రాంచైజీలు భూతద్దంలో వెతుకుతున్నాయి. వాళ్లకు బెస్ట్ ఆప్షన్లుగా ఈ విదేశీ ప్లేయర్లు కనిపిస్తున్నారు.

బెన్ స్టోక్స్

బెన్ స్టోక్స్

ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ దేనికైనా అసాధ్యుడే. నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టగలడు. అదే సమయంలో బౌలర్లకు చుక్కలు చూపించగలడు కూడా. దానికితోడు మంచి వేగం, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను బుట్టలో వేసుకోగలడు. అందుకే అతని కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడబోతున్నాయి. మైదానంలో బెస్ట్ ఫీల్డర్లలో స్టోక్స్ కూడా ఒకడు. అంతెందుకు అతని ఐపీఎల్ కెరీర్‌లో రెండు సెంచరీలు ఉన్నాయంటేనే ఎంత విధ్వంసకర బ్యాటరో అర్థం చేసుకోవచ్చు.

కార్లోస్ బ్రాత్‌వైట్

కార్లోస్ బ్రాత్‌వైట్

బెన్ స్టోక్స్ వంటి అత్యుత్తమ బౌలర్ వేస్తున్న ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదడం అంటే మాటలు కాదు. అది కూడా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వంటి అతిపెద్ద వేదికపై. అలాంటి ఒత్తిడిని తట్టుకొని నాలుగు సిక్సర్లు బాదిన కార్లోస్ బ్రాత్‌వైట్.. 2016 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌కు కప్పు అందించాడు. అలాగే మంచి ఫీల్డర్ కూడా. అవసరమైతే చక్కగా బౌలింగ్ కూడా చేసే సత్తా అతనికి ఉంది. కాబట్టి బ్రాత్‌వైట్‌కు మంచి ధర దొరికే అవకాశాలు చాలానే ఉన్నాయి.

కామెరూన్ గ్రీన్

కామెరూన్ గ్రీన్

భారత పర్యటనలో ఓపెనర్‌గా వచ్చి సత్తా చాటిన కామెరూన్ గ్రీన్‌ను ఆస్ట్రేలియా జట్టు సాధారణంగా ఫినిషర్ రోల్‌లోనే ఉపయోగించుకుంటుంది. అయితే భారత కండిషన్స్ తనకు చక్కగా సరిపోతాయని అతను ఇప్పటికే నిరూపించుకున్నాడు. అవసరమైతే బంతితోనూ సత్తా చాటగిలిగే గ్రీన్.. ఎంత బిగ్ హిట్టరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా తరఫున కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఆ జట్టు చరిత్రలో రెండో వేగవంతమైన అర్థశతకం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

జేసన్ హోల్డర్

జేసన్ హోల్డర్

గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ తరఫున పెద్దగా రాణించలేదని, ఆ జట్టు జేసన్ హోల్డర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ మాజీ విండీస్ కెప్టెన్ ఎంతటి విధ్వంసకారుడో చెప్పాల్సిన అవసరం లేదు. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను హోల్డర్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఒత్తిడిని చక్కగా తట్టుకునే హోల్డర్ మంచి నాయకుడు కూడా. తన పొడవును చక్కగా ఉపయోగించుకొని ఎలాంటి పిచ్‌పై అయినా బౌన్స్ రాబట్టగల సత్తా కూడా అతనికి ఉంది. కాబట్టి అతని కోసం పోటీ గట్టిగానే ఉంటుంది.

జేమ్స్ నీషమ్

జేమ్స్ నీషమ్

రాజస్థాన్ రాయల్స్ కూడా పెద్దగా రాణించలేదనే కారణంతో జేమ్స్ నీషమ్‌ను రిలీజ్ చేసింది. అయితే అతను న్యూజిల్యాండ్ తరఫున బాగానే రాణించాడు. మల్టీ డైమెన్షనల్ ప్లేయర్ అయిన నీషమ్.. ఎలాంటి పరిస్థితిలో అయినా భారీ షాట్లు ఆడగలడు. ఎలక్ట్రిక్ ఫీల్డింగ్ చేస్తాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. కనీస ధర రూ.2 కోట్లుగా ఉన్న అతన్ని.. మరీ భారీ ధర కూడా చెల్లించకుండానే సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు కచ్చితంగా ఆసక్తి చూపుతాయి. మరి అతని కోసం పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

Story first published: Friday, December 23, 2022, 10:18 [IST]
Other articles published on Dec 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+