న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్-11 నుంచి శాశ్వతంగా దూరమైన స్టాన్ లేక్

Fractured finger rules Stanlake out of IPL 2018

హైదరాబాద్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే జట్టు సీనియర్‌ ఆటగాళ్లంతా గాయాలతో ఇబ్బంది పడ్తుంటే.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చెన్నైతో మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా స్టాన్‌లేక్‌ వేలికి గాయమైంది. అతను త్వరంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సన్‌రైజర్స్‌ ట్వీట్‌ చేసింది.

''బిల్లీ.. ఐపీఎల్‌-11 మిగతా భాగానికి దూరమయ్యాడు. అతడి వేలికి గాయమైంది. టోర్నమెంట్లో ఇక ఆడొద్దని వైద్యులు అతడికి సూచించారు'' అని జట్టు యాజమాన్యం తెలిపింది. చికిత్స కోసం స్వదేశం (ఆస్ట్రేలియా) వెళుతున్న అతను లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సన్‌రైజర్స్‌ ప్రకటించింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టాన్‌ లేక్‌ 5 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సన్‌రైజర్స్‌ తరపున బౌలింగ్‌ జాబితాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే గత ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ ఈ ఆసీస్‌ బౌలర్‌ గాయపడ్డాడు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు దూరమయ్యాడు. భువనేశ్వర్‌కు అండగా రాణిస్తాడని భావించిన సన్‌ యాజమాన్యానికి నిరాశే మిగిలింది. వేలంలో ఈ ఆసీస్‌ ఆటగాడిని సన్‌రైజర్స్‌ రూ.50 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో రెండు వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 87 పరుగులకే ఆలౌటైంది. తాజా విజయంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టు అని మరోసారి రుజువు అయింది.

Story first published: Wednesday, April 25, 2018, 9:50 [IST]
Other articles published on Apr 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X