బాక్సింగ్ డే టెస్టు: లబుషేన్ హాఫ్ సెంచరీ.. అరుదైన రికార్డు మిస్!!

మెల్‌బోర్న్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం 'బాక్సింగ్ డే' టెస్టు ప్రారంభం అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా తొలిరోజు ముగిసేసరికి 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (41) రాణించగా.. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ (63), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (77) హాఫ్ సెంచరీలు చేశారు.
గంగూలీని దురుసు వ్యక్తిగా భావించా.. కానీ 40 నిమిషాల్లో నా మనసు గెలిచాడు!!
ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న లబుషేన్ (149 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసాడు. దీంతో లబుషేన్ అరుదైన రికార్డును మిస్ చేసుకున్నాడు. గత మూడు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన లబుషేన్ మెల్‌బోర్న్ టెస్టులోనూ శతక్కొడితే... వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేసిన ఆరో ఆ్రస్టేలియన్‌గా నిలిచేవాడు. అయితే 63 పరుగులు చేసి కోలిన్ డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో బోల్డ్ అయి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.
ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 'మూడుసార్లు' నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేసాడు. ఫింగ్లెటన్, హార్వీ, హేడెన్, స్మిత్ వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేశారు. లబుషేన్ కూడా సెంచరీ చేస్తే.. ఈ జాబితాలోకి వచ్చేవాడు. అయితే లబుషేన్‌కు ఈ రికార్డు మిస్ అయిందని చెప్పలేం. ఎందుకంటే అతనికి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశం ఉంది.
మొదటగా బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జో బర్న్స్ డకౌట్ అయ్యాడు. మొదటి ఓవర్లోనే బోల్ట్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. వార్నర్, లబుషేన్ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. హాఫ్ సెంచరీకి చేరువలో వార్నర్ ఔట్ అయినా.. స్మిత్ అండగా లబుషేన్ రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీ అనంతరం లబుషేన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్ (38) ఔట్ అయినా.. స్మిత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు స్మిత్ (77), హెడ్ (25) క్రీజులో ఉన్నారు. గ్రాండ్‌హోమ్ రెండు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications