న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే నిలకడగా ఆడుతూ స్కోరును పెంచారు. ఇంకా రెండు రోజులు ఆటకు సమయం ఉన్న నేపథ్యంలో భారీ ఆధిక్యతపై భారత్ కన్నేసినట్లు కనిపిస్తోంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో భారత్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సు స్కోరుపై 403 పరుగుల ఆధిక్యత సాధించింది.
ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 83 పరుగులతోనూ, అజింక్యా రహనే 52 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్సులో రహనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ జోడీని విడగొట్టడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు ఏ మాత్రం ఫలితం సాధించలేకపోయారు.
దక్షిణాప్రికాపై జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్సులో మూడో రోజు శనివారం భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ సాధించాడు. అజింక్యా రహనేతో కలిసి అతను ఆచితూచి ఆడుతున్నాడు.
అంతకు ముందు 53 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 21 పరుగులు చేసి మోర్కెల్ బౌలింగులో అవుటయ్యాడు. భారత్ 57 పరుగుల వద్ద నాలుగు వికెట్ కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో ఛతేశ్వర్ పుజారా 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.
నాలుగు టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో 213 పరుగుల ఆధిక్యతను సాధించిన భారత్ రెండో ఇన్నింగ్సును ప్రారంభించింది. 13 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ మోర్కెల్ బౌలింగులో డకౌటయ్యాడు. అంతకు మురళీ విజయ్ కేవలం మూడు పరుగుల మాత్రమే చేసి మోర్కెల్‌కే వికెట్ సమర్పించుకున్నాడు.

భారత్‌పై జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా 121 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే. డీవిల్లీర్స్ ఒంటరి పోరాటానికి రెండో వెపు నుంచి ఏ మాత్రం మద్దతు లభించలేదు. వరుసగా వికెట్లు పడుతూ పోయాయి. డి
విల్లీర్స్ 42 పరుగులు చేేశాడు. భారత్ తొలి ఇన్నింగ్సులో 334 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరుపై భారత్ 213 పరుగుల ఆధిక్యతను సాధించింది. ఇమ్రాన్ తాహిర్ ఒక్క పరుగు చేసి అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.