For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాల్గో టెస్ట్: 121 పరుగులకే కుప్పకూలిన సఫారీలు

By Pratap

న్యూఢిల్లీ: భారత్‌పై జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా 121 పరుగులకే కుప్పకూలింది. డీవిల్లీర్స్ ఒంటరి పోరాటానికి రెండో వెపు నుంచి ఏ మాత్రం మద్దతు లభించలేదు. వరుసగా వికెట్లు పడుతూ పోయాయి. డివిల్లీర్స్ 42 పరుగులు చేేశాడు. భారత్ తొలి ఇన్నింగ్సులో 334 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరుపై భారత్ 213 పరుగుల ఆధిక్యతను సాధించింది. ఇమ్రాన్ తాహిర్ ఒక్క పరుగు చేసి అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

అనూహ్యంగా ఈ మ్యాచులో భారత ఫాస్ట్ బౌలర్లు కూడా రాణించారు. రవీంద్ర జడేజా మరోసారి రాణించి ఐదు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, ఉమేష్ యాదవ్ రెండేసి వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మకు ఒక్క వికెట్ లభించింది.

Fourth test, 2nd day: Rahane makes century against SA

భారత్‌పై జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా ముందు నిలబడలేకపోతున్నారు. 62 పరుగులకే సఫారీలు నాలుగో వికెట్ కోల్పోయారు. రవీంద్ర జడేజా బౌలింగులో డూ ప్లెసిస్ డకౌట్ అయ్యాడు. 65 పరుగుల స్కోరు వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగులో డుమినీ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టాడు.

దక్షిణాఫ్రికా 79 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను జారవిడుచుకుంది. ఇషాంత్ శర్మ బౌలింగులో డానే విలాస్ 11 పరుగుల మాత్రమే చేసి చేతులెత్తేశాడు. 84 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగులో అబాట్ నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా 103 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పెడిట్ ఐదు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగులో అవుటయ్యాడు.

Fourth test, 2nd day: Rahane makes century against SA

అంతకు ముందు 36 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఎల్గార్ 17 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగులో వెనుదిరిగాడు. 40 పరుగుల స్కోరు వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ను జారవిడుచుకుంది. బువామా 22 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగులో వెనుదిరిగాడు. దక్షిణాప్రికా 56 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు మాత్రమే చేసి హషీం ఆమ్లా రవీంద్ర జడేజా బౌలింగులో వికెట్ పారేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాపై జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ 334 పరుగులకు ఆలవుట్ అయింది. రహనే సెంచరీ, అశ్విన్ అర్థ సెంచరీతో భారత్ ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. ఉమేష్ యాదవ్ పది పరుగులతో నాటవుట్‌గా నిలిచాడు. అశ్విన్ 56 పరుగులు చేసి అవుట్ కాగా, ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్సు ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్ ఐదు వికెట్లు తీయగా, పెడిట్ నాలుగు వికెట్లు తీశాడు. ఇమ్రాన్ తాహీర్‌కు ఒక వికెట్ లభించింది.

Fourth test, 2nd day: Rahane makes century against SA

భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఎట్టకేలక దక్షిణాఫ్రికా అజింక్యా రహనేను ఔట్ చేయగలిగింది. రహనే చాలా ఓపిగ్గా ఆడి 127 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో ఔటయ్యాడు. దీంతో భారత్ 296 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హేమాహేమీలు విఫలమైన చోట రవిచంద్రన్ అశ్విన్ నిలదొక్కుకున్నాడు. అతను అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

వికెట్ల వద్ద గట్టిగా పాతుకుపోవడానికి అవసరమైన సహనాన్ని సమకూర్చుకుని దక్షిణాఫ్రికాపై భారత భ్యాట్స్‌మన్ అజింక్యా రహనే సెంచరీ చేశాడు. దక్షిణాప్రికాపై జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో భారత్ శుక్రవారం ఉదయం బ్యాటింగ్‌కు దిగింది.

భారత బ్యాట్స్‌మెన్‌లో రహనే ఒంటరి పోరాటం చేస్తూ దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్ష పెట్టాడు. రహనేకు రవిచంద్రన్ అశ్విన్ తోడుగా నిలిచాడు. ఇరువురు కూడా శుక్రవారం ఉదయం కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ నింపాదిగా పరుగులు చేస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+