Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వన్డే టీమ్‌లో నలుగురు ఇండియన్స్, కెప్టెన్‌గా ధోని

Mahendra Singh Dhoni
సోమవారం లండన్‌లో ప్రకటించిన ఈ సంవత్సరం ఐసిసి వన్డే జట్టులో ప్రపంచ చాంపియన్ భారత జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో సహా నలుగురు భారతీయులు ఐసిసి వన్డే జట్టులో చోటు చేసుకున్నారు. ధోనిని జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. జట్టులోఇతర భారతీయులు ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, క్రికెట్‌ ప్రపంచ కప్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సీరీస్‌ అవార్డు విజేత యువరాజ్‌ సింగ్‌, ప్రధాన పేస్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌. జట్టుకు సారథ్యం వహించడమే కాకుండా ధోని వరుసగా నాలుగవ సంవత్సరం వికెట్‌కీపర్‌గా కూడా ఉంటాడు. సచిన్‌ టెండూల్కర్‌ లేని ప్రపంచ జట్టులో ఇండియా గరిష్ఠ సంఖ్యలో క్రీడాకారులు ఉన్నారు.

ప్రపంచ కప్‌లో రన్నర్సప్‌గా నిలచిన శ్రీలంకకు చెందిన ఇద్దరు క్రీడాకారులు మొదటి 11 మందిలో స్థానం సంపాదించారు. 12వ క్రీడాకారుడు కూడా శ్రీలంక సభ్యుడే. దక్షిణాఫ్రికాకు ఇద్దరు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌లకు ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌లో సెహ్వాగ్‌కు శ్రీలంక క్రికెటర్‌ తిలకరత్నె దిల్షన్‌ ఓపెనింగ్‌ జోడీగా ఉన్నాడు. మరొక శ్రీలంక క్రికెటర్‌ కుమార్‌ సంగక్కార కీలకమైన మూడవ స్థానంలో వస్తాడు. నాలుగవ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఎబి డివిలీర్స్‌, ఐదవ స్థానంలో ఆస్ట్రేలియన్‌ షేన్‌ వాట్సన్‌, ఆరవ స్థానంలో యువరాజ్‌ సింగ్‌, ఏడవ స్థానంలో ధోని బ్యాట్‌ చేస్తారు. జహీర్‌తో కలసి పాకిస్తాన్‌కు చెందిన ఉమర్‌ గుల్‌, దక్షిణాఫ్రికాకు చెందిన డేల్‌ స్టీన్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకుంటారు.

ప్రముఖ వెస్టిండియన్‌ బ్యాట్స్‌మన్‌, మాజీ కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌ అధ్యక్షతన ప్రత్యేకంగా నియమించిన సెక్షన్‌ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. ఒడిఐ జట్టులో ఇండియా ఆధిపత్యం ప్రపంచ కప్‌లో వారి విజయాన్ని ప్రతిబింబిస్తున్నట్లు ఐసిసి అవార్డుల సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ లాయిడ్‌ చెప్పారు. 'ఈ సంవత్సరపు ఒడిఐ జట్టు ఇండియా విజయాన్ని ప్రతిబింబిస్తున్నది.లండన్‌లో సోమవారం ఎల్‌జి ఐసిసి అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ఈ సంవత్సరపు ఒడిఐ జట్టును ఐసిసి ప్రకటించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+