కపిల్‌దేవ్ పునాది వేస్తే.. కోహ్లీ నిర్మించాడు!!

ఢిల్లీ: టీమిండియా పేస్ దాడిపై వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించారు. టీమిండియా ప్రస్తుత బౌలర్లు ఇప్పటికిప్పుడే అత్యుత్తమ స్థాయిని అందుకోలేదు. కపిల్ దేవ్ వంటి మాజీ పేసర్లు పునాది వేస్తే.. పేస్ దాడిని ఇష్టపడే విరాట్ కోహ్లీ బౌలింగ్ విభాగంను మరింత దృఢంగా మార్చాడు అని బిషప్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా పేస్ దాడి మరో స్థాయిలో ఉండటానికి కపిల్ వంటి మాజీ పేసర్లు వేసిన పునాదే కారణమని ఆయన అంటున్నాడు.

పునాది వేసింది కపిల్:
తాజాగా ఇయాన్ బిషప్ మాట్లాడుతూ... 'కొన్ని సంవత్సరాల క్రితం లైనప్‌ను చూస్తే.. టీమిండియా బౌలింగ్ ఇంతలా మెరుగవుతుందని ఊహించలేదు. అయితే ప్రస్తుత బౌలర్లు ఇప్పటికిప్పుడే అత్యుత్తమ స్థాయిని అందుకోలేదు. ఇందుకు పునాదులు ఎప్పుడో పడ్డాయి. గతంలో కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్ ఉన్నారు. ఇప్పుడు కోహ్లీకి పేసర్లంటే ఇష్టం. వారిని అతడు నమ్మాడు. బౌలింగ్ విభాగంను మరింత దృఢంగా మార్చాడు' అని అన్నాడు.

తరాలకు గుర్తుండిపోయే బుమ్రాను గుర్తించారు:
'తరాలకు గుర్తుండిపోయే పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గుర్తించారు. అతడు అన్ని ఫార్మాట్లలోనూ రాణించగలడు. మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒకప్పుడు మేం ఇతర జట్లకు చేసిందే టీమిండియా మాకు చేస్తుందని అనుకోలేదు. ఈ ఘనత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బోర్డు పాలకులు, కెప్టెన్‌లదే' అని బిషప్ పేర్కొన్నాడు.

ఆర్చర్‌ను ఎదుర్కోవడం కష్టం:
'టీమిండియా పేసర్లు బాగా ఆడుతున్నప్పుడు పోలికలు రావడం సహజమే. అయితే అలా చేయలేను. ఎందుకంటే.. ఎలా పోల్చాలో నాకు తెలీదు. ఇప్పుడున్న వారిలో అత్యుత్తమ బౌలర్‌లు చాలామంది ఉన్నారు. మంచి లయలో ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడం కష్టం. నసీమ్ షా, బుమ్రా, షమీ అద్భుతం' అని చెప్పుకొచ్చారు.

'షమీ అంటే నాకెంతో ఇష్టం:
'షమీ అంటే నాకెంతో ఇష్టం. టీమిండియా పేస్ దాడిలో ఒకరిని ఎంచుకొని అతన్ని అత్యుత్తమం అని చెప్పలేను. యువ బౌలర్లు శివమ్ మావి, కమలేశ్ నాగర్ కోటి ఇలాగే కొనసాగుతారో లేదో చూడాలి. టీ20 ప్రపంచకప్ గెలిచినంత మాత్రాన టీమిండియాను ఓడించడం విండీస్‌కు అంత సులభం కాదు. అయితే ఈ అనుభవం వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు పనికొస్తుంది' అని బిషన్ ధీమా వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications