For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ సీమర్‌ నర్స్‌ ఇకలేరు

Former West Indies batsman Seymour Nurse dies aged 85

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెస్టిండీస్‌ లెజెండరీ మాజీ క్రికెటర్‌ సీమర్‌ నర్స్‌ (85) సోమవారం కన్నుమూశారు. ఈ మేరకు బార్బడోస్‌, వెస్టిండీస్‌ దిగ్గజం డెస్‌మండ్‌ హేన్స్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. సీమర్‌ నర్స్‌ మృతి పట్ల విండీస్ బోర్డు సంతాపం తెలిపింది. పలువురు వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్లు నర్స్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

1960-1969 కాలంలో సీమర్స్‌ 29 టెస్టులాడి 47.6 స్ట్రయిక్‌ రేట్‌తో 2,523 పరుగులు చేశారు. అందులో 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1967లో 'క్రికెటర్ అఫ్ ది ఇయర్' అవార్డు కూడా అందుకున్నారు. సీమర్‌ నర్స్‌ రిటైర్మెంట్‌ అనంతరం బార్బడోస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌లో కోచ్‌గా పని చేశారు. బార్బడోస్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు.

'ఇష్టమైన కోచ్‌, మెంటార్‌, ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇక లేరు. అందరం నీ బాటలోనే నడవాలనుకుంటున్నాం. బ్యాటింగ్, మాటల్లో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. నా కోసం చేసిన దానికి మీకు కృతజ్ఞతలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం' అని హేన్స్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు.

Story first published: Tuesday, May 7, 2019, 17:03 [IST]
Other articles published on May 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+