మాజీ టెస్టు క్రికెటర్ మిల్కా సింగ్ కన్నుమూత
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ ఏజీ మిల్కా సింగ్ (75) శుక్రవారం కన్నుమూశారు. శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గుండె పోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మిల్కాసింగ్ 1960వ దశకంలో భారత్ తరుపున నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మిల్కాసింగ్ సోదరుడు క్రిపాల్ సింగ్ దేశం తరపున క్రిపాల్ సింగ్ కూడా భారత్ తరుపున 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వీరిద్దరూ 1961-62 మధ్య కాలంలో ఇంగ్లాండ్‌పై ఒకే టెస్టు మ్యాచులో ఆడారు.

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన మిల్కాసింగ్ మంచి ఫీల్డర్ కూడా. తన 17వ ఏట రంజీ ట్రోఫీలో అప్పటి మద్రాసు (ఇప్పుడు తమిళనాడు) నుంచి రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశారు. 18వ ఏట తొలి టెస్టు ఆడారు. మిల్కాసింగ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎనిమిది సెంచరీలతో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించారు.
మిల్కాసింగ్ మేనల్లుడు కృపాల్ సింగ్ సైతం తమిళనాడు తరఫున రంజీల్లో ఆడారు. 1987లో గోవాపై ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్‌సింగ్ బేడీ మిల్కాసింగ్ మృతికి సంతాపం తెలిపారు. 'ఒకప్పుడు టెస్టుల్లో దూకుడైన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ మిల్కాసింగ్ ఇకలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక' అని ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications