Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: పొలార్డ్‌కు ఎమోషనల్ మెసేజ్ పంపిన ఫ్రెండ్.. నెట్టింట ట్వీట్ వైరల్

Former teammate gets emotional over Pollard retirement from IPL

ప్రపంచ ప్రఖ్యాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక శకం ముగిసింది. ముంబై ఇండియన్స్‌తో ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేసిన కీరన్ పొలార్డ్.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ముంబై ఇండియన్స్‌ కుటుంబంలో కీలక సభ్యుడిగా ఉన్న అతను.. ఆ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలనందించాడు.

ఐపీఎల్‌కు పొలార్డ్ గుడ్‌బై

ఐపీఎల్‌కు పొలార్డ్ గుడ్‌బై

గతేడాది ఐపీఎల్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన పొలార్డ్.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దానికితోడు జట్టులోని సీనియర్ ప్లేయర్లలో అతను కూడా ఒకడు. ఈ క్రమంలోనే మినీ వేలానికి ముందు అతన్ని రిలీజ్ చేయాలని ముంబై ఇండియన్స్ భావించింది. అయితే ముంబైలో లేకుండా ఐపీఎల్‌లో ఆడటం ఇష్టం లేదన్న పోలీ.. క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక నుంచి ఆ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ముంబైతోనే పయనం

ముంబైతోనే పయనం

ఐపీఎల్ ప్రారంభమైన మూడో ఏడాది అంటే 2010లో ముంబై ఇండియన్స్‌తో చేరిన పోలీ.. అప్పటి నుంచి అదే జట్టుతో ఉన్నాడు. ముంబై అభిమానుల గుండెలపై చెరగని ముద్ర వేశాడు. జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా, కెప్టెన్‌గా అన్ని పాత్రలూ పోషించిన అతను.. వచ్చే ఏడాది నుంచి ముంబై కలర్స్‌లో కనిపించడనే నిజాన్ని అభిమానులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

స్నేహితుడి ఎమోషన్..

పొలార్డ్ రిటైర్‌మెంట్‌పై మరో విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో స్పందించాడు. 'ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు నిన్ను 13 ఏళ్ల క్రితం పరిచయం చేయడంలో చిన్న పాత్ర పోషించా. మాలనీలో ఒక చిన్న పిల్లాడి నుంచి అత్యుత్తమ టీ20 లీగ్‌లో ఆధిపత్యం చెలాయించే స్థాయికి నువ్వు ఎదగడం చూశా.

ప్రపంచం నలుమూలల్లో అభిమానులను సంపాదించుకున్నావు. నీ అత్యద్భుతమైన కెరీర్‌కు సెల్యూట్ చేస్తున్నా లార్డ్.. జీవితంలో నీ తర్వాతి ఛాప్టర్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. నీకు, నీ అభిమానులకు ఇదొక బాధాకరమైన రోజని తెలుసు. అదే సమయంలో నువ్వు సాధించిన విజయాలను కూడా స్మరించుకుంటాం. నీకు సందేశం పంపుతున్నందుకు, నీ స్నేహితుడిగా గర్వపడుతున్నా' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Story first published: Wednesday, November 16, 2022, 14:37 [IST]
Other articles published on Nov 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+