For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో చెత్త రికార్డు.. 14 ఏళ్లుగా ధోనీదే అగ్రస్థానం!!

Former Team India skipper MS Dhoni holds an unwanted record in T20Is

హైదరాబాద్: 2005లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. జట్టులోకి వచ్చిన రెండేళ్లలోనే కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత నాయకత్వంతో టీమిండియాకు తొలి పొట్టి కప్ అందించాడు. ఆపై 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. క్రికెట్ ప్రపంచంలోనే మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ మహీ. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్, గొప్ప వికెట్ కీపర్, అంతకుమించి బెస్ట్ ఫినిషర్. ఇలాంటి ధోనీని 14 ఏళ్లుగా అంతర్జాతీయ టీ20ల్లో ఓ చెత్త రికార్డు వెంటాడుతోంది.

'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లేదు:

'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లేదు:

భారత్ తరఫున 2006లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. ఇప్పటి వరకూ 98 మ్యాచ్‌లు ఆడాడు. 98 మ్యాచ్‌లలో మహీ ఒక్క 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌‌' అవార్డు గెలవలేదు. క్రికెట్ చరిత్రలో 71కి పైగా టీ20లు ఆడినా.. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలవని ఏకైక క్రికెటర్ ధోనీనే. అంతర్జాతీయ క్రికెట్‌లో 98 టీ20 మ్యాచ్‌లాడిన ధోనీ.. 37.6 సగటుతో 1617 పరుగులు చేశాడు. ఇందులో 116 ఫోర్లు, 52 సిక్సర్లు ఉండగా.. కేవలం రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే చేశాడు.

ధోనీ@1:

ధోనీ@1:

అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌‌' అవార్డు గెలవని జాబితాలో ఎంఎస్ ధోనీతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. దినేశ్ రామ్‌దిన్ (71 మ్యాచ్‌లు), అస్గర్ అఫ్గాన్ (69), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (61), దినేశ్ చండిమాల్ (54) ధోనీ తర్వాత టాప్-5లో కొనసాగుతున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవకుండా ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడింది మాత్రం మన 38 ఏళ్ల మహీనే. టీ20ల్లో ఎక్కువగా స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ చేసే ధోనీకి తక్కువ బంతులు ఆడే అవకాశం వస్తుంటుంది. దీంతోనే మహీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌‌ అవార్డు గెలిచే అవకాశం రాలేదు.

ప్రపంచకప్ తర్వాత దూరం:

ప్రపంచకప్ తర్వాత దూరం:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. కనీసం దేశవాళీ టోర్నీల్లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాదాపు 6 నెలలు జట్టుకు దూరమవడంతో బీసీసీఐ అతడికి సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో మహీ రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరు మాజీల నుండి ఒత్తిడి ఎక్కువైంది. ఐపీఎల్-2020లో ఫామ్ నిరూపించుకుని.. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నాడు.

ఐపీఎల్-13 నిరవధిక వాయిదా:

ఐపీఎల్-13 నిరవధిక వాయిదా:

ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడి ఫామ్ నిరూపించుకోవడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎంఎస్ ధోనీ ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐపీఎల్-13 నిరవధికంగా వాయిదా పడిపోయింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే కొందరు మాజీలు మహీ మెగా టోర్నీ ఆడాలని సూచిస్తుండగా.. మరికొందరు ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Monday, April 20, 2020, 21:01 [IST]
Other articles published on Apr 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+