Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

16 ఏళ్లుగా ప‌దిలం: ప్ర‌మాదంలో ప‌డ్డ సౌర‌బ్ గంగూలీ ప్ర‌పంచ‌క‌ప్ రికార్డు!

Former Team India Captain Sourav Ganguly World Cup Cricker Record in Danger

లండ‌న్‌: ఇంగ్లండ్ వేదిక‌గా ఏ ముహూర్తంలో ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ను ఆరంభించారో గానీ.. రికార్డులు బ‌ద్ద‌ల‌వుతూనే ఉన్నాయి. స‌రికొత్త రికార్డులు తెరమీదికి వ‌స్తున్నాయి. మ్యాచ్, మ్యాచ్‌కూ స‌రికొత్త రికార్డుల కొత్త‌గా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో- భార‌త క్రికెట‌ర్లు నెల‌కొల్పిన కొన్ని అరుదైన రికార్డులు సైతం బ‌ద్ద‌లు కావ‌డానికి సిద్ధంగా ఉంటున్నాయి. తాజాగా.. టీమిండియా మాజీ కేప్టెన్ సౌర‌బ్ గంగూలీ నెల‌కొల్పిన ప్ర‌పంచ‌క‌ప్ రికార్డు ప్ర‌మాదంలో ప‌డింది.

16 ఏళ్ల పాటు చెక్కుచెద‌ర‌కుండా వ‌చ్చిన ఈ అరుదైన ఉదంతాన్ని అందుకోవ‌డానికి ఒక‌రు కాదు ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్లు సిద్ధంగా ఉన్నారు. ఒక‌రు ఆస్ట్రేలియా కేప్టెన్ అరోన్ పింఛ్, మ‌రొక‌రు- న్యూజీలాండ్ స్కిప్ప‌ర్ కేన్ విలియ‌మ్స‌న్‌. ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లూ ఇప్ప‌టికే ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో రెండు సెంచ‌రీల‌ను ఊదేశారు. వారిద్ద‌రి రూపంలో సౌర‌బ్ గంగూలీ రికార్డుకు ప్ర‌మాదం పొంచివుంది. వారిద్ద‌రిలో ఎవ‌రు ముందుగా సెంచ‌రీ చేస్తే.. గంగూలీ సాధించిన మైలురాయిని అందుకున్న ఘ‌నత వారి సొంతం అవుతుంది.

కేప్టెన్‌గా మూడు సెంచ‌రీలు బాదిన సౌర‌బ్‌

ఓ జ‌ట్టుకు కేప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ మూడు సెంచ‌రీలను బాదిన రికార్డు సౌర‌బ్ గంగూలీ పేరు మీద ఉంది. 2003 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ సంద‌ర్భంగా ఆయ‌న దీన్ని నెల‌కొల్పారు. 2003 నుంచి ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ వ‌ర‌కూ ఈ రికార్డు ప‌దిలంగా ఉంటూ వ‌స్తోంది. 2003 త‌రువాత మొత్తం మూడు ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌రిగిన‌ప్ప‌టికీ.. దీని జోలికి ఎవ‌రూ వెళ్లలేక‌పోయారు. 2007, 2011, 2015 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ల‌ల్లో ఏ జ‌ట్టు కేప్టెన్ కూడా ఆ స్థాయిలో సెంచ‌రీలు న‌మోదు చేయ‌లేదు.

ఫించ్‌, కేన్ విలియమ్స‌న్‌ల అరుదైన ఘ‌న‌త‌

తాజాగా అరోన్ ఫించ్‌- ఈ రికార్డుకు అతి స‌మీపానికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా జ‌ట్టు కేప్టెన్‌గా ఫించ్ ఇప్ప‌టికే రెండు సెంచ‌రీలు చేశాడు. శ్రీలంక మీద ఒక‌టి, లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో మ‌రొక సెంచ‌రీని సాధించాడ‌త‌ను. ఇదే ఊపులో మ‌రో సెంచ‌రీ కూడా ఊదేయ‌గ‌ల‌డ‌నిపిస్తోంది. ఆస్ట్రేలియా త‌న త‌దుపరి మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ను ఎదుర్కొన‌బోతోంది. న్యూజీలాండ్ స్కిప్ప‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ కూడా త‌క్కువేమీ కాదు. విలియ‌మ్స‌న్ కూడా ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు బాదేశాడు.

ఈ రెండు కూడా జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు సాధించిన‌వే కావ‌డం విశేషం. జ‌ట్టు కేప్టెన్‌గా ఉంటూ రెండు సెంచ‌రీలు న‌మోదు చేసిన సంద‌ర్భాలు కూడా ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అతి కొద్ది సంద‌ర్భాల్లో మాత్ర‌మే చోటు చేసుకున్నాయి. 1975 నాటి ప్ర‌పంచ‌క‌ప్‌లో గ్లెన్ ట‌ర్న‌ర్‌, 2003 నాటి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా కేప్టెన్ రికీ పాంటింగ్‌, 2015 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో బ్రెండ‌న్ టేల‌ర్ మాత్ర‌మే రెండు సెంచ‌రీలు సాధించిన జాబితాలో ఉన్నారు. కేన్ విలియ‌మ్స‌న్‌, అరోన్ ఫించ్ ఈ జాబితాలో చేరారు. సౌర‌బ్ గంగూలి రికార్డుపై క‌న్నేశారు

Story first published: Wednesday, June 26, 2019, 11:18 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+