Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuvraj Singh: కోహ్లీకి గోల్డెన్ షూస్ కానుక‌గా పంపిన యువీ.. నువ్వొక లెజెండ్‌వి అంటూ భావోద్వేగ లేఖ‌

Former Team India all-rounder Yuvraj Singh writes emotional letter to Virat Kohli

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ భావోద్వేగ లేఖ రాశాడు. త‌న ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా విరాట్ కోహ్లీ ఆట‌గాడిగా, కెప్టెన్‌గా ఎదిగిన విధానాన్ని అందులో వివ‌రించాడు. కోహ్లి తన కృషి , అంకితభావంతో దేశంలోని చాలా మంది ఆటగాళ్లను ఎలా ప్రేరేపించాడో యువరాజ్ తెలిపాడు. అదే సమయంలో భారత స్టార్ నుంచి మరెన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ల‌ను చూడాలనే కోరికను వ్యక్తం చేశాడు. కాగా యువ‌రాజ్‌సింగ్, విరాట్ కోహ్లీ గ‌తంలో టీమిండియా, ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున క‌లిసి ఆడారు.

నీ ఎదుగుద‌ల కుర్రాళ్ల‌ను ప్రేరేపిస్తుంది

''విరాట్ కోహ్లీ క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎదగడం నేను చూశాను. భారత క్రికెట్ దిగ్గజాలతో క‌లిసి నెట్స్‌లో భుజం భుజం రాసుకు తిరిగిన విరాట్ కోహ్లీ ఇప్పుడు కొత్త తరానికి దారితీసే లెజెండ్‌గా ఉన్నాడు. మైదానంలో నీ క్రమశిక్షణ, అభిరుచి, క్రికెట్‌ పట్ల అంకితభావం ఈ దేశంలోని ప్రతి చిన్న పిల్లవాడిని క్రికెట్ ఎంచుకొని ఏదో ఒక రోజు నీలిరంగు జెర్సీని ధరించాలని కలలు కనేలా ప్రేరేపిస్తుంది. నీవు ప్రతి సంవత్సరం నీ ఆట‌లో మెరుగుప‌డ్డావు. అలాగే ఈ అద్భుతమైన గేమ్‌లో ఇప్పటికే చాలా సాధించావు. నీ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని నీవు ప్రారంభించడాన్ని చూడటం నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. నీవు లెజెండరీ కెప్టెన్, అద్భుతమైన నాయకుడివి. నేను నీ నుంచి మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నాను.'' అని విరాట్ కోహ్లీని ఉద్దేశించి యువ‌రాజ్‌సింగ్ రాసుకొచ్చాడు.

ఆ బంధానికి సంతోషిస్తున్నాను

ఆ బంధానికి సంతోషిస్తున్నాను

అలాగే సహచర ఆట‌గాడిగా, స్నేహితుడిగా కోహ్లీతో బంధాన్ని పంచుకున్నందుకు తాను సంతోషిస్తున్నాన‌ని యువ‌రాజ్ సింగ్ తెలిపాడు. కలిసి పరుగులు సాధించడం, డైట్‌ విషయంలో చీటింగ్ చేయ‌డం, పంజాబీ పాటలు వినడం, ప్ర‌పంచ‌కప్‌ గెలవడం.. వీటన్నింటిలో తాము కలిసే ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా యువీ గుర్తు చేసుకున్నాడు. అలాగే ప్రపంచానికి విరాట్ కోహ్లీ కింగ్‌ కోహ్లి అయిన‌ప్ప‌టికీ, త‌న‌కు మాత్రం ఎప్పటికీ 'చీకూ' నే అని తెలిపాడు. కాగా చీకు అనేది కోహ్లి ముద్దుపేరు. కోహ్లీలో గెల‌వాల‌నే క‌సి, ప‌ట్టుద‌ల ఎప్ప‌టికీ ఉండాల‌ని, అత‌నొక సూప‌ర్ స్టార్ అని యువరాజ్ సింగ్ కొనియాడాడు.

కోహ్లీకి కానుక‌గా గోల్డెన్ బూట్స్‌

ఈ సంద‌ర్భంగా కోహ్లీకి యువ‌రాజ్ సింగ్ గోల్డెన్‌ బూట్స్‌ కానుకగా పంపాడు. కోహ్లీ, యువీ క‌లిసి ఓ ప్రముఖ బ్రాండ్‌కు కలిసి ఎండార్స్‌ చేస్తున్నారు. దీంతో సదరు కంపెనీకి చెందిన షూస్‌ను విరాట్ కోహ్లీకి కానుక‌గా పంపి యువ‌రాజ్‌ ఈ భావోద్వేగ‌ లేఖ రాశాడు. ''ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది అభిమానులకు చిరునవ్వులు పంచిన కెప్టెన్‌గా నీకు ఈ షూస్ ఇవ్వాల‌నుకుంటున్నాను'' అని రాసుకొచ్చాడు. దీంతో ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీకి యువ‌రాజ్ సింగ్ రాసిన ఈ భావోద్వేగ లేఖ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 సాధార‌ణ ఆట‌గాడిగా కోహ్లీ

సాధార‌ణ ఆట‌గాడిగా కోహ్లీ

కాగా చాలా కాలం పాటు విరాట్ కోహ్లీ, యువ‌రాజ్‌సింగ్ భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ త‌ర్వాత ఫాంలేమి స‌మ‌స్య‌ల‌తో యువ‌రాజ్ జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ఇక త‌న కెప్టెన్సీలో టీమిండియాకు మ‌ర‌పురాని విజ‌యాలు అందించిన విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం అన్ని ఫార్మాట్ల నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌ట్టులో సాధార‌ణంగా ఆట‌గాడిగా కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, February 22, 2022, 15:00 [IST]
Other articles published on Feb 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+