
చాలా ఇబ్బందిపడ్డా:
రసెల్ ఆర్నాల్డ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పోర్ట్స్ వ్యాఖ్యాత అరుణ్ వేణుగోపాల్‌తో కలిసి 'హోమ్ రన్ విత్ ఏవీ' అనే చాట్ షో నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆర్నాల్డ్ తన అనుభవాలను పంచుకున్నాడు. 'అప్పట్లో జట్టులోని కొంత మందితో ప్రేమ-ద్వేషపూరిత రిలేషన్‌షిప్ ఉండేది. రిలేషన్‌షిప్‌లో కొన్ని సమయాల్లో సరదాగా మరియు మరికొన్ని సందర్భాల్లో బాధించేవి ఉండేవి. అయితే ముత్తయ్య మురళీధరన్‌తో తీరుతో మాత్రం చాలా ఇబ్బందిపడ్డా. ఒక్కోసారి అతను చెప్పే మాటలు చాలా బాధించేవి' అని రసెల్ చెప్పాడు.

మోటార్ మౌత్ అని పిలిచేవాళ్లం:
'మ్యాచ్ జరుగుతుండగా బ్యాట్స్‌మెన్ ఔటై పెవిలియన్‌కి వచ్చినప్పుడు.. మురళీధరన్ అతని పక్కకి వెళ్లి అతడు ఆడిన షాట్ తప్పిదాన్ని ఎత్తిచూపేవాడు. బ్యాటింగ్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న బ్యాట్స్‌మెన్ పక్కకి వెళ్లి.. గత మ్యాచ్‌లో నువ్వు ఆడిన షాట్ మళ్లీ ఆడకు అని చెప్పేవాడు. మురళీధరన్ కొన్ని విలువైన సలహాలు, సూచనలు చేసేవాడు. కానీ అదేపనిగా చెపుతూ విసిగించేవాడు. దాంతో అందరం అతడిని మోటార్ మౌత్ అని పిలిచేవాళ్లం' అని రసెల్ ఆర్నాల్డ్ తెలిపాడు. శ్రీలంక తరఫున 1997 నుంచి 2007 వరకు రసెల్ మ్యాచ్‌లు ఆడాడు. లంక తరఫున 44 టెస్టులు, 180 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు.

టాప్ క్లాస్ ప్లేయర్:
'ముత్తయ్య మురళీధరన్ టాప్ క్లాస్ ప్లేయర్. అద్భుతమైన వ్యక్తి. విశాల హృదయం కలవాడు. ఆవేశంతో ఎదో చెప్పినా.. వెంటనే తన తప్పిదంను గ్రహిస్తాడు. కష్ట సమయాల్లో స్నేహితుని కోసం చూసేటప్పుడు మురళీధరన్ కంటే మంచి వ్యక్తి కనబడడు' అని రసెల్ ఆర్నాల్డ్ పేర్కొన్నాడు. తన స్పిన్ మాయాజాలంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 1347 వికెట్లు పడగొట్టాడు.

495 మ్యాచ్‌ల్లో 1347 వికెట్లు:
ఆఫ్ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో ముత్తయ్య మురళీధరన్‌లోని ప్రత్యేక శైలి. స్పిన్ లెజెండ్ మురళీధరన్ బౌలింగ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. టెస్ట్ ఫార్మాట్‌లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 495 మ్యాచ్‌ల్లో 1347 వికెట్లు పడగొట్టి కెరీర్‌ను అద్భుతంగా ముగించాడు.


Click it and Unblock the Notifications

'కోహ్లీ' విజయ రహస్యం నాకు చెప్పాడు: హార్దిక్ పాండ్యా










