న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంక మాజీ క్రికెటర్లు జోయ్సా, గుణవర్ధనేలపై ఐసీసీ సస్పెన్షన్‌

Former Sri Lanka cricketers Nuwan Zoysa and Avishka Gunawardene charged with match-fixing

శ్రీలంక మాజీ క్రికెటర్లు నువాన్ జోస్య (40), అవిష్క గుణవర్దనే (41)పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాత్కాలిక సస్పెన్షన్‌ విధించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఐసీసీ తాత్కాలిక సస్పెన్షన్‌ విధించింది. అభియోగాలపై బదులిచ్చేందుకు ఇద్దరికి 14 రోజుల గడువు ఇచ్చింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

యూఏఈ వేదికగా గత డిసెంబర్‌లో జరిగిన టీ10 లీగ్‌లో ఆడిన నువాన్ జోస్య, అవిష్క గుణవర్దనేలు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ఇందులో అర్టికల్ 2.1.1 ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసేలా ఈ ఇద్దరు వ్యవహరించినట్లు బయటపడింది. దీంతో ఐసీసీ ఇద్దరిపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించింది.

గతేడాది నవంబర్‌లో అవినీతి నిరోధక కోడ్ కింద జోయ్సా ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నాడు. 1997-2007 మధ్య కాలంలో మాజీ బౌలర్ జోయ్సా శ్రీలంక తరపున 30 టెస్టులు, 95 వన్డేలు ఆడాడు. మాజీ ఓపెనర్ గుణవర్దనే 1999-2006 మధ్య కాలంలో శ్రీలంక తరపున 6 టెస్టులు, 61 వన్డేలు ఆడాడు. ఇక ఫిబ్రవరిలో మాజీ శ్రీలంక కెప్టెన్ సనత్ జయసూర్య రెండు సంవత్సరాలు క్రికెట్ నుండి నిషేధించబడిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, May 11, 2019, 10:01 [IST]
Other articles published on May 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X