Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: జట్టులో ఆ మార్పులు చేయాలి.. లేకుంటే కష్టమేనన్న హర్బజన్ సింగ్..

Former spinner Harbajan Singh said that the final team of Team India should make many changes

ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో
2022 T20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ స్పందించాడు. ఇది భయాందోళనలకు సమయం కానప్పటికీ, KL రాహుల్ విఫలం కావడం ఆలోచించాల్సిన విషమన్నారు. జట్టు ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చాలన్నాడు.

KL రాహుల్ గొప్ప

KL రాహుల్ గొప్ప

"వారు కొన్ని కఠినమైన కాల్‌లను తీసుకోవలసి రావచ్చు, జట్టు ముందుకు వెళ్లడం గురించి ఆలోచించాలి. KL రాహుల్ గొప్ప ఆటగాడు, మనందరికీ తెలుసు, అతను మ్యాచ్ విన్నర్. కానీ అతను తన ఫామ్‌తో ఇలా ఇబ్బంది పడుతుంటే, మీరు రిషబ్ పంత్‌ను తీసుకురావాలని నేను భావిస్తున్నాను' అని హర్భజన్ స్పోర్ట్స్ టాక్‌లో పేర్కొన్నాడు.

దినేష్ కార్తీక్

దినేష్ కార్తీక్

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ విఫలమయ్యాడు. పంత్ ను జట్టులోకి తీసుకుని.. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కార్తీక్ స్థానాన్ని దీపక్ హుడాతో భర్తీ చేయాలన్నాడు. తద్వారా జట్టుకు అదనపు స్పిన్ ఎంపికను అందించవచ్చని హర్భజన్ చెప్పాడు. "కార్తీక్ గాయపడినట్లు కనిపిస్తున్నాడు. అతని స్థితి ఏమిటో నాకు తెలియదు. రాహుల్ కాకపోతే రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఓపెనింగ్ గా పంపొచ్చు. బౌలింగ్ లో దీపక్ హుడాను కూడా తీసుకురావచ్చని చెప్పాడు.

యుజ్వేంద్ర చాహల్‌

యుజ్వేంద్ర చాహల్‌

అలాగే రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను భారత్ జట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు బజ్జీ. టోర్నీలో చాహల్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అశ్విన్ తన నాలుగు ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడని గుర్తు చేశాడు."అశ్విన్‌ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ని తీసుకురావాలని నేను భావిస్తున్నాను. అతను వికెట్లు తీసే బౌలర్. మీరు 2-3 వికెట్లు తీసినంత మాత్రాన పరుగులు ఇవ్వడానికి మీకు అభ్యంతరం లేదు. చాహల్ ఒక పెద్ద మ్యాచ్ విన్నర్ "అని అతను చెప్పాడు.

Story first published: Monday, October 31, 2022, 16:49 [IST]
Other articles published on Oct 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+