Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్

Former selector wants Rahul Tripathi to get more chances

టీమిండియా బ్యాటర్ రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మాజీ సెలెక్టర్ సాబా కరీం అన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో త్రిపాఠీ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైన అతను.. తన రెండో మ్యాచ్‌లో మ్యాచ్ టోన్‌ను సెట్ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు మరింత వేగంగా ఆడి భారీ స్కోరు చేయగలిగింది. అతన్ని ఇన్నింగ్స్‌ను మాజీలు కూడా మెచ్చుకున్నారు.

ఇదే విషయాన్ని గుర్తు చేసిన సాబా కరీం.. త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, న్యూజిల్యాండ్‌తో తొలి టీ20లో అతన్ని ఆడించాలని కోరాడు. అతనిలా సత్తా ఉన్న ఆటగాళ్లను కచ్చితంగా ఆడించాలన్నాడు. 'రాహుల్ త్రిపాఠీకి మూడో స్థానంలో మరిన్ని అవకాశాలు ఇస్తే చూడాలని అనుకుంటున్నా. తను ఆడిన రెండో మ్యాచులోనే అతను బాగా బ్యాటింగ్ చేశాడు. మంచి స్ట్రైక్ రేటుతో ఆడాడు కూడా. ఇంత మంచి బ్యాటర్ ఉన్నప్పుడు వేరే మార్పులు అవసరం లేదు' అని చెప్పాడు.

త్రిపాఠీ తర్వాత నాలుగో స్థానంలో కచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. వీళ్లిద్దరి తర్వాత దీపక్ హుడాను ఆడిస్తే సరిపోతుంది. ఇక ఓపెనర్ల విషయానికొస్తే గత మ్యాచుల ఫామ్‌ను బట్టి వాళ్లను ఎంపిక చేయాలి. ఈ విషయంలో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ మొదటి ఆప్షన్ అని తేల్చేశాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో గిల్ తొలి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. అయితే మూడో వన్డేలో 46 పరుగులు చేశాడు. ఇషాన్ అయితే తొలి మ్యాచ్‌లో 37 పరుగులు చేసినా.. మిగతా రెండు మ్యాచుల్లో విఫలమైన సంగతి తెలిసిందే.

Story first published: Friday, January 27, 2023, 16:53 [IST]
Other articles published on Jan 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+