INDvsAUS : రాహుల్‌ను పక్కన పెట్టాల్సిన టైం ఇదే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. వరుసగా విఫలం అవుతున్నా కూడా అతనికి ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు? అనేది చాలా మంది మాజీలు అడుగుతున్న ప్రశ్న. రాహుల్ కన్నా బెటర్ ఆటగాళ్లు, మంచి ఓపెనింగ్ ఇవ్వగలిగిన వాళ్లు భారత్‌లో లేరా? అని నిలదీస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా మాజీ లెజెండ్ వెంకటేశ్ ప్రసాద్ ఈ విషయంలో చాలా ట్వీట్లు చేసి రాహుల్ ఎంపికను నిలదీశాడు.

అదే నేనిచ్చే సలహా..
అయితే అతనికి ఆకాష్ చోప్రా వంటి వాళ్లు మద్దతు ఇస్తున్నారు. రాహుల్ చాలా ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మాజీ సెలెక్టర్, మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా రాహుల్ ఎంపిక ప్రశ్నించాడు. 'నాకు రాహుల్ అంటే చాలా అభిమానం. నేను అతన్ని రోల్స్ రాయిస్ రాహుల్ (ఆర్ఆర్ఆర్) అని పిలుస్తా. కానీ ప్రస్తుతం అతను గొప్పగా ఆడలేకపోతున్నాడు. ఇది కాదనలేని నిజం. నేనే కనుక సెలెక్షన్ కమిటీ చైర్మన్ అయి ఉంటే.. అతని దగ్గరకు వెళ్లి కొంత విశ్రాంతి తీసుకో అని సలహా ఇచ్చేవాడిని' అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

రాహుల్ టైం వచ్చేసింది..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో రాహుల్ మరీ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో కూడా ఘోరంగా ఆడాడు. ఈ క్రమంలోనే జట్టులో అతన్ని వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు తొలగించారు. దీంతో మూడో టెస్టులో అతన్ని ఆడించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించడం గమనార్హం. గతంలో భారత్ తరఫున రాహుల్ ఆడిన గొప్ప ఇన్నింగ్సులను శ్రీకాంత్ మెచ్చుకున్నాడు. కానీ ప్రస్తుతం అతని ఫామ్‌ను ఒక సెలెక్టర్‌గా చూస్తే మాత్రం.. ఇక అతన్ని పక్కన పెట్టాల్సిన సమయం ఇదేనని అభిప్రాయపడ్డాడు.

గిల్‌ను ఆడించడమే కరెక్ట్..
రాహుల్ స్థానంలో మంచి ఫామ్‌లో యువ ప్లేయర శుభ్‌మన్ గిల్‌ను ఆడిస్తే బెటర్ అని, మూడో టెస్టులో అతన్నే ఆడించాలని శ్రీకాంత్ సూచించాడు. రాహుల్ బ్యాటింగ్‌లో టెక్నికల్‌గా ఎలాంటి సమస్య లేదన్న శ్రీకాంత్.. బహుశా అతను ఏదైనా మెంటల్ బ్లాకేజ్‌తో ఇబ్బంది పడుతున్నాడేమో? అని అన్నాడు. ఈ క్రమంలో రాహుల్ కొంత విశ్రాంతి తీసుకుంటే తిరిగి ఫామ్ అందుకునే ఛాన్స్ ఉంటుందని సలహా ఇచ్చాడు. 'రాహుల్ అంటే నాకు గౌరవమే కానీ.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌ను ఆడించే టైం వచ్చిందని అనుకుంటున్నా. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఊరికే పక్కన పెట్టడం కరెక్ట్ కాదు' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications