Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Daniel Vettori: విరాట్ కోహ్లీ మ‌ళ్లీ కెప్టెన్ కాలేడు.. ఆర్సీబీ మాజీ కెప్టెన్ కీల‌క వ్యాఖ్య‌లు

Former Royal Challengers Bangalore captain Daniel Vettori says Virat Kohli has no chance of becoming captain again

ఐపీఎల్ 2022లో ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ త‌మ కెప్టెన్ల‌ను ప్ర‌క‌టించిన‌ప్పకీ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు త‌మ కెప్టెన్‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఫాఫ్ డుప్లిసిస్, గ్లెయిన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి ఆట‌గాళ్ల పేర్లు తెర‌పైకి వ‌స్తున్న‌ప్ప‌టికీ జ‌ట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రికొంద‌రైతే విరాట్ కోహ్లీనే మ‌ళ్లీ కెప్టెన్సీ చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్బీబీ మాజీ కెప్టెన్‌, న్యూజిలాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు డేనియల్ వెటోరి ఈ కెప్టెన్సీ రేసుపై ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేశాడు.

కోహ్లీ అవ‌కాశాలు లేవు

కోహ్లీ అవ‌కాశాలు లేవు

విరాట్ కోహ్లీ మ‌ళ్లీ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ అయ్యే అవ‌కాశాలు లేవ‌ని ఆ జ‌ట్టు మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు డేనియల్ వెటోరి వ్యాఖ్యానించాడు. ఒక సారి కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాక మ‌ళ్లీ ఆ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉండ‌వ‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో, అంత‌ర్జాతీయ క్రికెట్లో మ‌ళ్లీ కెప్టెన్ అవ‌డం సాధ్యం కాద‌ని అన్నాడు. విరాట్ కోహ్లీ వార‌సులుగా గ్లెయిన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసెస్‌, దినేశ కార్తీక్ పేర్ల‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మేనేజ్‌మెంట్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తుంద‌ని వెటోరీ చెప్పాడు.

వారే కెప్టెన్‌

వారే కెప్టెన్‌

ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండ‌ర్ మాక్స్‌వెల్‌నే ఆర్సీబీ త‌మ కెప్టెన్‌గా ఎంచుకుంటుంద‌ని తాను అనుకుంటున్న‌ట్లు వెటోరీ తెలిపాడు. ఒక వేళ మాక్స్‌వెల్ ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్‌ల‌కు దూర‌మైతే క‌చ్చితంగా సౌతాఫ్రికా మాజీ క్రికెట‌ర్ ఫాఫ్ డుప్లిసెస్‌ను ఆర్సీబీ త‌మ కెప్టెన్‌గా ఎంచుకుంటుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశాడు. కాగా డేనియ‌ల్ వెటోరీ గ‌తంలో విరాట్ కోహ్లీ కంటే ముందు రాయ‌ల్ చాలెజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ర‌న్న‌ర‌ఫ్‌గా ఆర్బీబీ

ర‌న్న‌ర‌ఫ్‌గా ఆర్బీబీ

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజ‌యంత‌మైన‌ప్ప‌టికీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఒక్క సారి కూడా ట్రోపీని గెలుచుకోలేపోయింది. 2011తోపాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2016లో ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు ర‌న‌ర‌ఫ్‌తోనే స‌రిపెట్టుకోవ‌ల్సి వ‌చ్చింది. 2016లో విరాట్ కోహ్లీ బ్యాట‌ర్‌గా దుమ్ములేపాడు.

4 సెంచ‌రీల‌తో ఏకంగా 973 ప‌రుగులు బాదేశాడు. కాగా ఈ సీజ‌న్ ఐపీఎల్ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. మే 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో టోర్నీ ముగియ‌నుంది. మొత్తం టోర్నీలో 74 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నుండ‌గా 10 జ‌ట్లు పోటీప‌డుతున్నాయి.

IPL 2022 : RCB Opening Players | RCB Playing XI | Oneindia Telugu
రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్క్వాడ్ 2022

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్క్వాడ్ 2022

విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెసిస్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, జోష్ హేజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రాయ్, జాసన్ బెహ్రాయ్, మిలింద్, అనీశ్వర్ గౌతమ్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, లువ్నిత్ సిసోడియా, సిద్ధార్థ్ కౌల్.

Story first published: Monday, March 7, 2022, 19:33 [IST]
Other articles published on Mar 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+