Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్‌కి ఉరేసుకుని మాజీ క్రికెటర్ ఆత్మహత్య

హైదరాబాద్: రంజీ మాజీ ఆటగాడు అమోల్‌ జిచ్‌కర్‌ (38) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్‌పూర్‌లోని అతని ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మంగళవారమే క్రికెట్ ట్రైనింగ్ ప్రారంభించిన అమోల్‌ జిచ్‌కర్‌ కుమారుడికి ఇది చాలా విషాదకర వార్త. నాగ్‌పూర్‌లోని లేబర్ కోర్టుకు కూతవేటు దూరంలో భార్య, కుమారుడితో అమోల్‌ జిచ్‌కర్‌ నివాసం ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇటీవల మాజీ క్రికెటర్‌ విపుల్‌ పాండేతో కలిసి అమోల్‌ ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఆయితే ఈ రెస్టారెంట్‌ నష్టాల్లో నడవడంతో ఆర్ధికంగా చితికిపోయిన అమోల్‌ తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Former Ranji cricketer Amol Jichkar commits suicide

నాగ్‌పూర్‌కు చెందిన అమోల్‌ జిచ్‌కర్‌ 1998, 2002లో రంజీ ట్రోఫీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు మ్యాచ్ లాడిన అమోల్‌ ఏడు వికెట్లు దక్కించుకున్నాడు. విదర్భ అండర్-19 జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు.

పూణెలోని పెద్ద సోదరుడు అంకుష్ ఇంటికి అమోల్‌ జిచ్‌కర్‌ తల్లిదండ్రులు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అమోల్‌ జిచ్‌కర్‌ ఇంటిలో ఎలాంటి సూసైడ్ నోట లభించలేదని పోలీసులు తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+