Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిశ్చితార్థ సంబరాలు చేసుకుంటోన్న మాజీ కెప్టెన్‌

Former Proteas Skipper Graeme Smith Gets Engaged, Shares Adorable Picture On Social Media

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. తన ప్రేయసిని పెళ్లాడేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే రోమీ లాంఫ్రాంచీకి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. స్మిత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. అతని పోస్టుకు స్పందించిన నెటిజన్లు ఆన్‌లైన్ వేదికగా శుభాకాంక్షలను ట్వీట్‌ల రూపంలో కురిపించారు.

ప్రేమకు చిహ్నంగా డిసెంబరు 2016లో

స్మిత్ 2014వ సంవత్సరం నుంచి రోమీ లాంఫ్రాంచీతో ప్రేమాయాణం కొనసాగిస్తున్నాడు. వారి ప్రేమకు చిహ్నంగా డిసెంబరు 2016లో ఓ బాబుకు జన్మనిచ్చారు. స్మిత్‌కు ఇది రెండో వివాహం కాగా, మొదటి వివాహం మోర్గాన్ డీనెతో జరిగింది. ఆమెతో ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.

కెప్టెన్ కోహ్లీపై విమర్శలకు దిగి

కెప్టెన్ కోహ్లీపై విమర్శలకు దిగి

స్మిత్ ఈ సంవత్సర ఆరంభంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలకు దిగాడు. పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన కోహ్లీసేన సిరీస్‌ను 1-2తేడాతో సరిపెట్టుకుంది. దాంతో కోహ్లీ నాయకత్వ లక్షణాలపై విమర్శలు సంధించాడు. కోహ్లీని సుదీర్ఘ కాల కెప్టెన్‌గా కొనసాగేందుకు సరిపోడంటూ ఉచిత సలహాలిచ్చాడు.

దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బాధ్యతలు

దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బాధ్యతలు

స్మిత్ తన అంతర్జాతీయ కెరీర్‌కు 2014 మార్చిలో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. పదవీ విరమణ ముందువరకూ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బాధ్యతలు వహించాడు. అతని ఖాతాలో 117టెస్టులు ఆడి 9265 పరుగులు చేసిన చరిత్ర ఉంది. వాటిలో 27సెంచరీలు 38 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 109 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

197 మ్యాచ్‌లు ఆడి 6989పరుగులతో

197 మ్యాచ్‌లు ఆడి 6989పరుగులతో

వన్డే ఫార్మాట్ విషయానికొస్తే.. స్మిత్ 197 మ్యాచ్‌లు ఆడి 6989పరుగులు చేశాడు. వాటిలో 10 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక షార్ట్ ఫార్మాట్ టీ20 విషయానికొస్తే ఆడిన 33 మ్యాచ్‌లకు 982పరుగులు చేశాడు.

Story first published: Thursday, November 1, 2018, 12:25 [IST]
Other articles published on Nov 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+