Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : భారత్‌లో పిచ్‌లపై మాజీ ఆసీస్ ప్లేయర్ చురకలు.. ఫ్యాన్స్ ఫైర్!

Former player takes a dig at indian pitches before INDvsAUS Test series

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ రేసులో భారత్‌కు చాలా కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సమయం దగ్గరపడింది. దీని కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హేలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్‌లో స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌లు చేస్తారంటే హేలీ దుయ్యబట్టాడు. భారత్ కనుక ఇలాంటి దారుణమైన పిచ్‌లు చేస్తే ఆస్ట్రేలియా కచ్చితంగా 2-1 తేడాతో సిరీస్ ఓడిపోతుందని అన్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా నెగ్గాలి. అందుకోసం టీమిండియా చాలా కష్టపడుతోంది. ఇదే విషయాన్ని చెప్పిన హేలీ.. దీని కోసం భారత క్యురేటర్లు పిచ్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేస్తారేమో అని అన్నాడు. గతంలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు స్పిన్ పిచ్‌లు తయారు చేయడాన్ని అతను గుర్తుచేశాడు. మొదటి రోజు నుంచే బంతి స్పిన్ అయ్యే పిచ్‌లు తయారు చేయడం దారుణమని చెప్పిన అతను.. భారత్ అలాంటి పిచ్‌లు తయారు చేయకపోతే ఆసీస్ ఈ సిరీస్ గెలిచే అవకాశం ఉందన్నాడు.

అయితే కొన్ని రోజుల క్రితం సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ తయారు చేసిన పిచ్ కూడా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీనిపై సఫారీ కెప్టెన్ ఎల్గార్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి పిచ్‌లు ఆటగాళ్లకు చాలా ప్రమాదకరం అని అన్నాడు. ఆసీస్‌లో అలాంటి పిచ్‌లు తయారు చేస్తూ భారత్‌లో చేసే పిచ్‌లను తప్పుబట్టడం ఏంటని అప్పుడే నెటిజన్లంతా కలిసి ఈ సో కాల్డ్ నిపుణులను కడిగిపారేశారు. అయినా బుద్ధి లేకుండా హేలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో క్రీడాభిమానులు మరోసారి సోషల్ మీడియాలో దండయాత్ర మొదలు పెట్టారు. ఇకనైనా ఈ ఎక్స్‌పర్టులు ఇలాంటి కామెంట్లు చేయడం మానుకుంటే బెటర్ అంటూ సలహా ఇస్తున్నారు.

Story first published: Tuesday, January 17, 2023, 12:36 [IST]
Other articles published on Jan 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+