పాకిస్తాన్ సక్సెస్ చూసి.. టీమిండియాలో మార్పులు: పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రజా

కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు.. టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టును వైట్ వాష్ చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా పాకిస్తాన్ ఓటమి చవి చూసింది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చీఫ్ రమీజ్ రజాపై వేటు వేసింది. అతని స్థానంలో నజామ్ సేథీ నేతృత్వంలోని 14 మంది ప్యానెల్‌కు పీసీబీ బాధ్యతలు అప్పగించింది.

కొత్త చీఫ్.. కొత్త ప్లాన్లు..
నజాం సేథీ ఈ బాధ్యతలు చేపట్టిన వెంటనే సెలెక్షన్ కమిటీలో మార్పులు చేశాడు. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని ఎంపిక చేశాడు. అలాగే అబ్దుల్ రజాక్ వంటి మాజీ ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీలో సభ్యులుగా మార్చారు. ఈ కమిటీ తమ తొలి ఎసైన్‌మెంట్‌గా న్యూజిల్యాండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు బాగానే ఉన్నాయని ఆ దేశ క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు.

భారత్‌కు అర్థం కాలేదు..
అయితే తనను పీసీబీ చీఫ్‌గా తప్పించినప్పటి నుంచి ఆ బోర్డుపై రకరకాల విమర్శలు చేస్తూ వస్తున్న రమీజ్ రజా.. తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు పాకిస్తాన్ వెళ్లింది. ఈ ఏడాది కూడా ఎవరూ ఊహించని విధంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన రమీజ్ రజా.. 'నా హయాంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించింది. బిలియన్ డాలర్ల విలువైన భారత క్రికెట్ బోర్డు కూడా సాధించని సక్సెస్ సాధించాం. పాకిస్తాన్ ఇంత ముందుకు ఎలా వెళ్లిందో కూడా భారత్‌కు అర్థం కాలేదు' అని చెప్పాడు.

బాబర్‌కు మద్దతు..
పాక్ ఇంత సక్సెస్ ఎలా సాధించిందో అర్థం కాకపోవడం వల్లనే.. బీసీసీఐ తమ సెలెక్షన్ చీఫ్‌పై వేటు వేసిందని, ఆ ప్యానెల్ మొత్తాన్ని తొలగించిందని, చివరకు జట్టు కెప్టెన్‌ను కూడా మార్చిందని రమీజ్ రజా అన్నాడు. తను బాబర్ ఆజమ్‌కు చాలా మద్దతు ఇచ్చానని, తన మద్దతు వల్లనే అతను బలమైన జట్టును తయారు చేయగలిగాడని వివరించాడు. కెప్టెన్ కీలకమైన క్రీడల్లో క్రికెట్ ఒకటి, అందుకే తాను బాబర్ ఆజమ్‌కు చాలా మద్దతుగా నిలిచానని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications