
T20 ప్రపంచ కప్‌లో ఆదివారం నెదర్లాండ్స్ చేతిలో టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా 13 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో పాకిస్తాన్ సెమీ-ఫైనల్ కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఒకవేళ నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా గెలిచి ఉంటే పాకిస్థాన్ ఇంటికి వెళ్లేది. అయితే పాకిస్థాన్-బంగ్లాదేశ్ ఆటకు ముందు, షోయబ్ అక్తర్ ఒక వీడియో పోస్ట్ చేశాడు.
ఆప్ బహుత్ బడే చోకర్స్ హై
"నేను ఇప్పుడే మేల్కొన్నాను. ధన్యవాదాలు, దక్షిణాఫ్రికా. ఆప్ బహుత్ బడే చోకర్స్ హై (మీరు చాలా పెద్ద చోకర్లు) మీరు పాకిస్తాన్‌కు పెద్ద అవకాశం ఇచ్చారు, మీకు పెద్ద ధన్యవాదాలు. పాకిస్థాన్‌ను ఎదుర్కొనే అర్హత ఉందని నేను అనుకోలేదు. జింబాబ్వే చేతిలో ఓడి సెమీ-ఫైనల్ అవకాశం సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్‌కు లైఫ్‌లైన్ అందించారు. మనం మరోసారి భారత్‌ను చూడాలి" అని అక్తర్ వీడియోలో పేర్కొన్నాడు.
దురదృష్టం
అయితే ఐసీసీ టోర్నమెంట్ లో సౌతాఫ్రికాను ఎప్పటి నుంచో దురదృష్టం వెంటాడుతుంది. వారు కీలక మ్యాచ్ లు ఆడినప్పుడు వర్షం కురవడం లేదా ఓడిపోవడం జరుగుతుంది. దీంతో వారు ఐసీసీ కప్ సాధించలేకపోతున్నారు. ఆదివారం నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరుకునే అవకాశాన్న చేజార్చుకున్నారు. నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా 159 పరుగులను ఛేదించలేకపోయింది. 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.