
ఏడు సంవత్సరాల పాటు ఐసీసీ అంపైర్‌గా
అలీమ్ దార్ వంటి వారితో పాటు పాకిస్థాన్ తరఫున ఇప్పటివరకు అంపైర్‌గా పని చేసిన లెజెండరీ అంపైర్‌లలో అసద్ రవూఫ్ ఒకరు. తిరిగి 2006లో రవూఫ్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్‌లలో చేర్చబడ్డాడు. ఆ తర్వాత అతను 47టెస్టులు, 98వన్డేలు మరియు 23 టీ20లకు ఎలైట్ ప్యానెల్ ఐసీసీ అంపైర్‌గా పనిచేశాడు. 2013లో అతని పనితీరుపై వార్షిక సమీక్ష జరిగింది. కొన్ని అవకతవకలకు పాల్పడ్డాడని నిర్ధారించాక ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల నుండి అతన్ని తొలగించారు. మొత్తంగా ఏడు సంవత్సరాల పాటు ఐసీసీ అంపైర్‌గా రవూఫ్ కొనసాగాడు. రవూఫ్ తన అంపైరింగ్ ప్రయాణాన్ని 1998లో ప్రారంభించాడు. 2000లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వన్డేల్లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు. నాలుగు సంవత్సరాల తరువాత 2004లో రవూఫ్ తొలిసారిగా అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చేర్చబడ్డాడు.

మంచి ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కూడా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా రవూఫ్ అంపైర్ బాధ్యతలను నిర్వర్తించాడు. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ విషయంలో అతని పేరు బహిర్గతమవ్వడంతో రవూఫ్ కెరీర్ పతనమైంది. ఇక ఆ తర్వాత అతను అంపైరింగ్ మానేయాల్సి వచ్చింది. ఇక తర్వాత లాహోర్‌లోని లాండా బజార్లో తన బట్టల దుకాణాన్ని నడుపుతూ జీవితాన్ని వెల్లదీస్తున్నాడు. రవూఫ్ సమర్థవంతమైన అంపైర్ మాత్రమే కాదు పాకిస్థాన్‌లో ప్రఖ్యాత ఫస్ట్-క్లాస్ క్రికెటర్ కూడా. అతను 71 ఫస్ట్ క్లాస్, 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. అందులో రవూఫ్ మూడు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సహాయంతో వరుసగా 3423, 611 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో రవూఫ్ లాహోర్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ రైల్వేస్, పాకిస్తాన్ యూనివర్సిటీ జట్లకు ఆడాడు.

మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడు
2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో రౌఫ్ కూరుకుపోయాడు. బుకీల నుంచి కాస్ట్‌లీ బహుమతులను స్వీకరించి అతను అవినీతికి పాల్పడినట్లు బీసీసీఐ డిసిప్లనరీ కమిటీ నిర్ధారించింది. ఇక 2016లో రౌఫ్‌పై బీసీసీఐ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇక ఈ విషయమై పాక్ టీవీ.టీవీతో అతను మాట్లాడుతూ.. 'నాకు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నేను ఐపీఎల్‌లో నా అత్యుత్తమ టైంను వెచ్చించాను. బీసీసీఐ నుంచి ఆరోపణలొచ్చాయి. వారంతట వారే నాపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ' అని ఇటీవల అసద్ రవూఫ్ మీడియాతో తెలిపిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
