Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీని దురుసు వ్యక్తిగా భావించా.. కానీ 40 నిమిషాల్లో నా మనసు గెలిచాడు!!

Former Pakistan spinner Saqlain Mushtaq reveals how Sourav Ganguly won his heart with brilliant gesture

ముంబై: మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ దూకుడు, ప్రవర్తన చూసి దురుసు వ్యక్తిగా భావించా. కానీ.. ఓసారి 40 నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత దాదా నా మనసు గెలిచాడు అని పాకిస్తాన్ మాజీ దిగ్గజ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ తెలిపారు. తన యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో ముస్తాక్‌ పైవిధంగా స్పందించారు.

 శస్త్రచికిత్స తర్వాత పునరాగమనం చేశా:

శస్త్రచికిత్స తర్వాత పునరాగమనం చేశా:

సక్లయిన్‌ ముస్తాక్‌ మాట్లాడుతూ... '2005-06లో ఇంగ్లండ్‌ టూర్‌లో భాగంగా భారత జట్టు ససెక్స్‌తో మూడు రోజుల మ్యాచ్‌ ఆడుతోంది. శస్త్రచికిత్స తర్వాత నేను పునరాగమనం చేశా. ఆ మ్యాచ్‌కు దాదా దూరంగా ఉన్నాడు. అయితే మ్యాచ్‌ చూసేందుకు వచ్చాడు. ససెక్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నన్ను బాల్కనీ నుంచి గమనించాడు. నా డ్రస్సింగ్‌ రూమ్‌ మరో దిశలో ఉండటంతో నేను అతడిని చూడలేదు' అని తెలిపారు.

 నా మనసు గెలిచాడు:

నా మనసు గెలిచాడు:

'కొంత సమయం తర్వాత అతడు దాదా నా గదిలోకి వచ్చి కాఫీ తాగుదామన్నాడు. ఎలా ఉన్నావు, గాయం మానిందా అని అడిగాడు. నా కుటుంబం గురించి అడిగాడు. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. ఆ తర్వాత మేం 40 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆ సమయంలో దాదా నా మనసు గెలిచాడు. నా లోచన తప్పని నిరూపించాడు' అని ముస్తాక్‌ చెప్పుకొచ్చారు.

దాదా విజయవంతమవుతాడు:

దాదా విజయవంతమవుతాడు:

గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకొన్న గంగూలీ.. ఆ అనుభవంతో బీసీసీఐ అధ్యక్షుడుగా కూడా విజయవంతమవుతాడని ముస్తాక్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ జట్లకు ముస్తాక్‌ స్పిన్‌ సలహాదారుగా అవసరమయినపుడు సేవలు అందిస్తున్నారు. కెప్టెన్‌గా మైదానంలో గంగూలీ హడావిడి చేసేవాడు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ కెప్టెన్ స్టీవ్‌ వాను సైతం టాస్‌ కోసం ఎదురుచూసేలా చేశాడు. మైదానంలో ఎవరైనా కవ్విస్తే.. తన బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.

Story first published: Thursday, December 26, 2019, 12:37 [IST]
Other articles published on Dec 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+