న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాయిలెట్లు శుభ్రం చేసే పనిలో: పాక్ మాజీ పేసర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

Former Pakistan players willing to work in toilets for PCB: Tanvir Ahmed sparks controversy yet again

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ పేసర్ తన్వీర్‌ అహ్మద్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పాక్‌తో తలపడేందుకు భయపడే కోహ్లీ టోర్నీ నుంచి తప్పుకున్నాడని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు పాలయ్యాడు.

మెల్‌బోర్న్‌లో 3rd ODI: ఆరోన్ ఫించ్‌కు భువనేశ్వర్ గండం, హ్యాట్రిక్ (వీడియో)మెల్‌బోర్న్‌లో 3rd ODI: ఆరోన్ ఫించ్‌కు భువనేశ్వర్ గండం, హ్యాట్రిక్ (వీడియో)

భారత క్రికెట్‌ అభిమానుల దెబ్బకు తన్వీర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలను సైతం క్లోజ్ చేశాడు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్లపై కూడా నోరుజారాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)లో పనిచేసేందుకు మాజీ ఆటగాళ్లకు అవకాశం లభించడం లేదని, కనీసం అక్కడ టాయిలెట్లు శుభ్రం చేసే పనిలోనైనా చేరదాం అనుకుంటున్నారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పాక్‌ మాజీ క్రికెటర్ల పరిస్థితి అంత దారుణంగా ఉందని ఓ స్థానిక టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో తన్వీర్‌కు పిచ్చిపట్టిందని, పెద్దలంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

పాక్‌ మాజీ కెప్టెన్‌, పీసీబీ చీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమాముల్‌ హక్‌పై కూడా తన్వీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంజమామ్‌ తన బంధువులకు జాతీయ జట్టులో చోటు కల్పించి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపిణలు గుప్పించాడు. ఈ వ్యాఖ్యలు పీసీబీలో దుమారం రేపాయి. ఇంజమామ్‌ మేనల్లుడు ఇమాముల్‌ హక్‌ పాక్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, January 18, 2019, 12:11 [IST]
Other articles published on Jan 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X