Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ గురించి ఏమీ తెలియనోడు - మొత్తం చెడగొట్టాడు: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ ఫైర్..!!

Former Pakistan cricketer Shahid Afridi slams BCCI Secretary Jay Shah on Asia Cup’s decision.

ముంబై: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ రెండు దేశాలు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాయంటే దానిపై ఏర్పడే అంచనాలు ఆకాశాన్ని అంటుతుంటాయి. క్రికెట్‌ను మించి..- అనే రేంజ్‌లో భావిస్తుంటారు అభిమానులు. తెలియకుండానే ఓ హై ప్రెషర్ ఏర్పడుతుంటుంది. అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు గురి అవుతుంటారు. రెండు జట్ల మధ్య మ్యాచ్‌గా కంటే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంగా భావిస్తుంటారు ఫ్యాన్స్.

తటస్థ వేదికలపై..

తటస్థ వేదికలపై..

ఈ రెండు జట్ల మధ్య తరచూ మ్యాచ్‌లు జరిగితే బాగుంటుందని భావించే అభిమానులూ లేకపోలేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కంప్ వంటి మెగా టోర్నమెంట్లల్లోనే కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా నిర్వహించాలనే డిమాండ్ కొంతకాలంగా ఉంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తటస్థ వేదిక మీదనైనా భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు ట్రోఫీలను నిర్వహించాలనే వాదనలు లేకపోలేదు.

ఆదివారమే..

ఆదివారమే..

రెండు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. దీనికి క్రికెట్ ప్రేమికుల నుంచి లభించిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మళ్లీ రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఈ రెండు జట్లు ఢీ కొట్టబోతోన్నాయి.. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ వేదికగా. ఈ ఆదివారం ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడబోతోన్నాయి. మెల్‌బోర్న్‌ గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం దీనికి వేదిక.

ఆసియా కప్ 2023కి పాక్ ఆతిథ్యం..

ఆసియా కప్ 2023కి పాక్ ఆతిథ్యం..

ఇలాంటి పరిస్థితుల మధ్య- వచ్చే ఏడాది ఆసియా కప్‌ను పాకిస్తాన్ నిర్వహించబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఆసియా కప్ 2023కి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది మన పొరుగుదేశం. ఈ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మరోసారి ఎదురుపడతాయని భావించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఆసియా కప్ 2023లో ఆడటానికి పాకిస్తాన్‌కు వెళ్లదలచుకోలేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఈ టోర్నమెంట్‌ను తటస్థ వేదిక మీద నిర్వహించదలిస్తే తప్ప తాము పాల్గొనబోమని పేర్కొన్నారు.

షాహిద్ అఫ్రిది ఫైర్..

షాహిద్ అఫ్రిది ఫైర్..

జై షా చేసిన ఈ ప్రకటనను పాకిస్తాన్ మాజీ ఆల్ ‌రౌండర్ షాహిద్ అఫ్రిది తప్పుపట్టారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో జై షాకు తెలియదని ఆరోపించారు. 12 నెలల్లో భారత్-పాకిస్తాన్ మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడిందని, గుడ్ ఫీల్, గుడ్ ఫ్యాక్టర్స్ నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ కార్యదర్శి ఈ ప్రకటన ఎందుకు చేశారని ప్రశ్నించారు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ గురించి అనుభవం లేకపోవడమే దీనికి కారణమని అన్నారు.

Story first published: Wednesday, October 19, 2022, 11:27 [IST]
Other articles published on Oct 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+