బాబర్ ఆజమ్ అవుట్?
Babar Azam: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరాజయాల తరువాత ఆ జట్టు కేప్టెన్ బాబర్ ఆజమ్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. కేప్టెన్‌గా అతన్ని తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కేప్టెన్సీ భారం.. అతని బ్యాటింగ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, రెండింటినీ న్యాయం చేయలేకపోతున్నాడంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా పాకస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. వన్డే ఫార్మట్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. బాబర్ ఆజమ్ ఓ అత్యుత్తమ బ్యాటర్ అని, కేప్టెన్సీ భారం అతని బ్యాటింగ్ రిథమ్‌ను దెబ్బతీస్తోందని పేర్కొన్నాడు. కేప్టెన్సీ బాధ్యతలు లేకపోతే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడని తేల్చి చెప్పాడు.

టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ కెప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు బాబర్ ఆజమ్. ఈ టోర్నమెంట్ గ్రూప్ ఏలో మూడోస్థానానికి పరిమితమైంది. గ్రూప్ దశను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. కొత్త జట్టు యునైటెడ్ స్టేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్ ఓటమిపాలు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది అప్పట్లో.
అప్పటి నుంచీ బాబర్ ఆజమ్‌ను వైట్ బాల్ ఫార్మట్‌లో కేప్టెన్‌గా తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంటూనే వస్తోంది. బాబర్ అజామ్ చివరిసారిగా నేపాల్‌పై సెంచరీ సాధించాడని, ఆ తరువాత అతని నుంచి బ్యాటింగ్ మెరుపులు కనిపించట్లేదని బాసిత్ అలీ వ్యాఖ్యానించాడు. కెప్టెన్ బాధ్యతలు లేకపోతే అతను తన బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టడానికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు.

కొన్ని కఠిన నిర్ణయాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనీ బాసిత్ అలీ సూచించాడు. జట్టులో సరిగ్గా ఆడని వరల్డ్ క్లాస్ ఆటగాడైనా సరే.. అతనిపై సాఫ్ట్ కార్నర్‌ను చూపకూడదని అన్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడైన షాన్ మసూద్.. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటుతాడని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications