Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్..మాజీ క్రికెటర్లు ఫైర్ (Video)

భారత్ సెమీస్ ఆశలు ఆవిరి అయ్యాయి. మహిళల టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం సాధిస్తే హర్మన్‌ప్రీత్ సేన సెమీఫైనల్స్‌కు చేరేది. కానీ కివీస్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. కనీస పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది. రికార్డు ఓటమి చవిచూసింది. ఫలితంగా గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లాయి. భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక ఇంటిముఖం పట్టాయి.

అయితే న్యూజిలాండ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌ సెమీస్‌కు వెళ్లొద్దనే రీతిలో పాక్ ఆడినట్లుగా ఉందని ట్రోల్స్ వస్తున్నాయి. పేలవమైన ఆట తీరుతో పాక్ రికార్డు ఓటమి చవిచూసింది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు (56) ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా అత్యల్ప స్కోరు చేసిన రెండో జట్టుగా పాక్ నిలిచింది.

Former Pakistan Captain Shocked as 8 Drops Against New Zealand Help Eliminate Team India from T20 World Cup

అంతేగాక పాకిస్థాన్ ఏకంగా ఎనిమిది క్యాచ్‌లను జారవిడించింది. ఇందులో ఒక్కటి కూడా కష్టతరమైన క్యాచ్ కాదు. అన్ని సులువైన క్యాచ్‌లే, నేరుగా చేతుల్లోకి వచ్చినా అందుకోలేదు. చివరి ఓవర్‌లో ఏకంగా మూడు క్యాచ్‌లను చేజార్చడం గమనార్హం. అయితే దీనిపై పాకిస్థాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్, టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. 'ఇలాంటి చెత్త ఫీల్డింగ్ తన 15 ఏళ్ల కెరీర్‌లోనే చూడలేదు' అని సనా పేర్కొంది.

మరోవైపు ఆకాశ్ చోప్రా పాకిస్థాన్‌ను వ్యంగ్యంగా విమర్శించాడు. బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించి, విశ్రాంతి ఇచ్చామని పాకిస్థాన్ చెప్పిన వివరణ తరహాలో ట్వీట్ చేశాడు. ''ఆసియాలో మేం ప్లేయర్లను తప్పించం. వాళ్లకు విశ్రాంతి మాత్రమే ఇస్తాం. అలాగే క్యాచ్‌లను చేజార్చం. బంతి మైదానంపై విశ్రాంతి తీసుకునేలా చేస్తాం'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఛేదనలో 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్... నాలుగు పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు కోల్పోవడం గమనార్హం.

Story first published: Tuesday, October 15, 2024, 14:03 [IST]
Other articles published on Oct 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+