
ఇదే సరైన సమయం అని భావించా:
'గత కొన్ని నెలలుగా నేను రిటైర్మెంట్ విషయంపై ఆలోచిస్తున్నాను. ఇదే సరైన సమయం అని భావించా. నా దేశం, క్రికెట్ ఆట కోసం నా సామర్థ్యం మేరకు నేను దోహదపడ్డానని నమ్ముతున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఎంతో మంది మిత్రులు నాకు సహకరించారు. మహిళల క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప క్రికెటర్లతో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్ల కథలు, వాళ్లు సాధించిన ఘనతలు నన్ను ఎంతో బలంగా.. తీర్చిదిద్దాయి. ఇంకా నాకు జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలు నేర్పించాయి. ఆటని ప్రేమించాలి.. అది ఓటమైనా, గెలుపైనా' అని సనా పేర్కొన్నారు.

ఐసీసీకి కృతజ్ఞతలు:
ఈ సుదీర్ఘ కెరీర్‌లో తనకు అండగా నిలిచిన అందరికీ సనా మీర్ ధన్యవాదాలు తెలిపారు. మహిళ క్రికెట్‌పై ఐసీసీ చూపుతున్న శ్రద్ధకి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా ఐసీసీ కారణంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి దేశాల క్రికెటర్లు తమ ప్రతిభను ప్రపంచ దేశాలకు పరిచయం చేసే అవకాశం దొరికిందని ఆమే పేర్కొన్నారు.

2005లో ఆరంగేట్రం:
కరాచీ వేదికగా 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశారు. తన 15 ఏళ్ల కెరీర్‌లో 120 వన్డేల్లో 1,630 పరుగులతో పాటు 151 వికెట్లు తీశారు. ఇక 106 టీ20 మ్యాచుల్లో 802 పరుగులు చేసి 89 వికెట్లు తీశారు. 2013, 2017 వన్డే ప్రపంచకప్‌లలో.. 2010, 2012, 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లలో సనా పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు.

బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్:
2018లో ఐసీసీ నెం.1 వన్డే బౌలర్‌గా సనా నిలిచారు. విజ్డెన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అయితే గత ఏడాది నుంచి ఆమెకు ఎదురుదెబ్బలు తగిలాయి. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడిన సనా మీర్‌పై ఆ తర్వాత వేటు పడగా.. టీ20 జట్టులోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో సనా ఇక కెరీర్‌కి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












