బాబర్, రిజ్వాన్ వల్ల పాక్ పెద్ద టోర్నీల్లో గెలవదు.. అందుకు కారణమిదే : పాక్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్

పాకిస్థాన్ ఓపెనర్లు కెప్టెన్ బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌ల వల్ల పాకిస్థాన్ పెద్ద పెద్ద టోర్నీలను గెలవలేదని ఆ జట్టు మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ అన్నాడు. ఈ ఇద్దరు పాకిస్థాన్‌కు టోర్నీలను గెలిపించే సహకారం అందించడం లేదని కామెంట్ చేశాడు. రిజ్వాన్, బాబర్ ప్రస్తుతం టీ20 బ్యాటింగ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జట్టు తరఫున అత్యధిక పరుగులను స్కోర్ చేస్తున్నప్పటికీ వీరి ఆట సరికాదని ఆకిబ్ జావేద్ అన్నాడు. వీరి వెయిట్-అండ్-వాచ్ విధానం ఛేజింగ్ టైంలో జట్టును తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని జావేద్ పేర్కొన్నాడు. వారి స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉందంటూ పేర్కొన్నాడు.

బాబర్, రిజ్వాన్ వల్ల తర్వాత వచ్చే బ్యాటర్లపై ప్రెషర్
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో బాబర్ ఆజామ్, ఫాఖర్ జమాన్‌ల వికెట్లను త్వరగా కోల్పోయినందున పాకిస్థాన్‌కు సరైన ఆరంభం దక్కలేదు. మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే వారిద్దరి ఆట విధానం అభిమానులకు, అలాగే విమర్శకులకు నచ్చలేదు. ఎందుకంటే అవసరమైన రన్ రేట్ పెరుగుతున్నా.. వారు పూర్తి వన్డే ఇన్నింగ్స్ ఆడడంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ప్రెషర్ పడింది. ఫైనల్‌లో పాకిస్థాన్ ఓటమికి ఇదే కారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

అందుకే శ్రీలంక చేతిలో ఓడింది
'ఈ ఇద్దరు ఓపెనర్లు (బాబర్, రిజ్వాన్) వల్ల పాక్ జట్టు టోర్నీలను గెలవలేదు. వీళ్లు ప్రపంచంలోని నం.1, నం.2 టీ20 ఆటగాళ్లు ఆ విషయాన్ని నేను కాదనను. కానీ ఆ ర్యాంకుల్లో ఉన్న ఆటగాడు ఎలాంటి ఆట ఆడాలో తెలుసుకోవాలి. రిజ్వాన్ రిక్వైడ్ రన్ రేట్ 8గా ఉన్నప్పుడు ఆటను మొదలెడతాడు. నిదానంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడతాడు. రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతూనే ఉంటుంది. ఇక ఓ 15, 17గా ఉన్నప్పుడు అప్పుడు ఆడదామని చూసి ఔటయిపోతాడు. ఆసియా కప్‌లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఫైనల్లో జరిగింది ఇదే. అందుకే శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోయింది' అని ఆకిబ్ జావేద్ విలేకరులతో పేర్కొన్నాడు. .

ఫాఖర్ జమాన్ ఆటను నాశనం చేస్తున్నారు
పాకిస్తాన్ జట్టు కూర్పు గురించి కూడా ఆకిబ్ జావేద్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫాఖర్ జమాన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్‌గా పంపాల్సిన అవసరం ఉందని జావేద్ సూచించాడు. 'ఫాఖర్ జమాన్‌ను నం.3లో బ్యాటింగ్ చేయించడం ద్వారా అతని ఆటను నాశనం చేస్తున్నారు. ఫాఖర్ ఈ ఇద్దరిలో ఒకరితో (బాబర్ మరియు రిజ్వాన్) ఓపెనింగ్ చేయాలి. అదే కరెక్ట్. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఏ జట్టుకైనా ఓపెనింగ్ పరంగా ఉపయుక్తంగా ఉంటుంది' అని జావేద్ పేర్కొన్నాడు.

రిజ్వాన్‌ను ఆ ఆర్డర్లో పంపించాలి
'తన ప్రకారం.. బాబర్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే అతనితో పాటు ఫాఖర్ జమాన్ కూడా ఆడాలి. ఖుష్దీల్ షాను నెం.3లో బ్యాటింగ్ చేయించాలి. రిజ్వాన్‌ను నం.4వద్ద ఆడనివ్వాలి. ఆ టైంకి ఎలాగూ మ్యాచ్‌లో బాదాల్సిన పరిస్థితి ఉంటుంది. అతను కచ్చితంగా తన స్ట్రైక్‌ని హిట్ చేస్తూ ఆడాల్సిన పరిస్థితే ఉంటుంది. నంబర్ 5లో తయ్యబ్ తాహిర్ లేదా అఘా సల్మాన్‌ని తీసుకురండి. ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్ విషయానికి వస్తే వీరికి ప్రత్యామ్నాయంగా ఉన్న ప్లేయర్లను చూడాలి. లేకపోతే వీరిని లోయర్ ఆర్డర్లో ఆడనివ్వండి.' అంటూ ఆకిబ్ జావేద్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications