Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : మార్క్రమ్ కాదు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతనికే నా ఓటు: మాజీ ఓపెనర్

 Former opener wants Bhuvi to lead Sunrisers Hyderabad not Markram

ఐపీఎల్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీల్లో సన్‌రైజర్స్ ఒకటి. ఈ జట్టు తాజాగా తమ జట్టు సారధ్య బాధ్యతలను సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్రమ్‌కు అందజేసింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు సారధ్యం వహించిన మార్క్రమ్.. ఆ జట్టుకు ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మాజీ ఓపెనర్ నాట్ హ్యాపీ..

మాజీ ఓపెనర్ నాట్ హ్యాపీ..

అయితే ఇలా మాటిమాటికీ కెప్టెన్లను మార్చడం సరికాదని ఫ్యాన్స్ కొంచెం సీరియస్ అయిన మాట మాత్రం వాస్తవం. కానీ గతేడాది జట్టుకు నాయకత్వం వహించిన కేన్ విలియమ్సన్‌ను కూడా మినీ వేలానికి ముందే రిలీజ్ చేసేసిన ఆ జట్టు.. కొత్త కెప్టెన్‌ను ఎంచుకోక తప్పదు కదా. ఈ క్రమంలోనే వేలంలో కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్, ఎప్పటి నుంచో ఫ్రాంచైజీతో ఉన్న భువనేశ్వర్ కుమార్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరకు మార్క్రమ్‌కే జట్టు పగ్గాలు అందించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా పెదవి విరిచాడు. తానైతే భువనేశ్వర్ కుమార్‌కు పగ్గాలు అందించే వాడినని చెప్పాడు.

 భువీకే నా ఓటు..

భువీకే నా ఓటు..

'ఎయిడెన్ మార్క్రమ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయ్యాడు. వాళ్ల దగ్గర భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్ రూపంలో మరో రెండు ఆప్షన్లు ఉన్నాయి. నేనైతే భువీకి ఓటేసేవాడిని. అతను ఈ ఫ్రాంచైజీతో చాలా కాలంగా ఉన్నాడు కదా. అతను ఇంకెక్కడా క్రికెట్ ఆడటం లేదు. భారత్ తరఫున వన్డేలు, టీ20లు కూడా ఆడట్లేదు. కాబట్టి మొత్తం ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉంటాడు. గతేడాది కూడా కేన్ విలియమ్సన్ లేని సమయంలో అతనే జట్టుకు కెప్టెన్సీ చేశాడు' అని చోప్రా గుర్తుచేశాడు. జట్టుతో ఇంత కాలంగా ఉన్న భువీని కెప్టెన్ చేసుంటే మాత్రం చాలా బాగుండేదని, తానైతే అదే పని చేసే వాడినని తేల్చి చెప్పాడు.

సౌతాఫ్రికా లీగ్ వల్లనే..

సౌతాఫ్రికా లీగ్ వల్లనే..

మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడాన్ని మాత్రం చోప్రా సమర్ధించాడు. మయాంక్ అద్భుతమైన బ్యాటర్ అని, అతని ఆటంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అయితే కెప్టెన్, బ్యాటర్‌గా గతేడాది అతని ప్రదర్శన చూసిన తర్వాత.. అతనిపై ఎక్కువ భారం పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. కాబట్టి అతన్ని విధ్వంసకర ఓపెనర్‌గా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు.. మార్క్రమ్ కెప్టెన్సీలో విజయవంతం కావడంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ కూడా అతనిక అప్పగించి ఉంటారని పేర్కొన్నాడు.

Story first published: Friday, February 24, 2023, 19:24 [IST]
Other articles published on Feb 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+