న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చైల్డ్ పోర్నోగ్రఫీ: జైలు పాలైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్

By Nageshwara Rao
Former New Zealand cricketer jailed for child pornography

హైదరాబాద్: చైల్డ్ పోర్నోగ్రఫీలో లైంగిక దుర్వినియోగానికి పాల్పడిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ హార్లీ జేమ్స్ జైలు పాలయ్యాడు. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్బరీ జట్టుకు ఆడిన 39 ఏళ్ల హార్లీ జేమ్స్‌కు స్థానికి క్రైస్ట్‌చర్చ్ కోర్టు రెండేళ్ల మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది.

చైల్డ్ పోర్నోగ్రఫీకి అలవాటు పడిన హార్లీ జేమ్స్ వద్ద సుమారు 3500 మంది చిన్నపిల్లలతో అసహాజ శృంగారానికి సంబంధించిన చిత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చాలా వరకు రెండు సంవత్సరాలు లోపు వయసు కలిగిన పిల్లలే కావడం విశేషం.

పోర్న్‌గ్రఫీ విషయం వెలుగులోకి రావడంతో హార్లీ జేమ్స్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వారంలో అతడు తన 40వ పుట్టిన రోజుని జరుపుకోనున్నాడు. ఇదిలా ఉంటే, హార్లీ జేమ్స్ క్రికెట్ కెరీర్ 1999లో ప్రారంభమైంది. దేశవాళీ క్రికెట్‌లో కాంటర్బరీ జట్టుకు ఆడేవాడు.

స్వతహాగా కుడి చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన జేమ్స్ మంచి స్పిన్నర్ కూడా. ఆ జట్టు తరుపున కేవలం ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగానే అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది. న్యూజిలాండ్ స్థానిక మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం హాక్స్ కప్ టోర్నీలో జేమ్స్ అద్భుత ప్రదర్శన చేసి కాంటర్బరీ జట్టుకు కప్ కూడా అందించాడంట.

Story first published: Tuesday, July 24, 2018, 18:26 [IST]
Other articles published on Jul 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X